పుట:PadabhamdhaParijathamu.djvu/115

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అఱ___అఱ 89 అఱ_____అఱ

అఱచేత బండ్లు వచ్చినప్పుడు కఱచెదవు కాక

 • నీ కంత గొప్పతనం వచ్చినప్పుడు చూద్దాం లే! ఇందులో అలాంటి గొప్పతనం నీ కెప్పుడూ రాదు అన్న సూచన కూడా ఇమిడి ఉన్నది. అఱచేతికి పండ్లు రావడమూ అసంభవం, నీవు కఱవడమూ అసంభవమే ననుట.
 • "అఱపు లుడిగి పోపో నీ, యఱచేతం బండ్లు వచ్చినప్పుడు మమ్ముం, గఱచెదవు గాని." కళా. 3. 230
 • "అఱచేత బండ్లు వచ్చిన,గఱతువు గా కిక్షుకార్ముకప్రతిపక్షా!" నిరం. 3. 32.

అఱచేత బ్రాణము లిడుకొను

 • పిడికిట ప్రాణములు పట్టుకొను.
 • ప్రాణభయముతో ననుట.

"పిఱుదం గురుధరణీపతి, యఱచేతం
బ్రాణములుగ నభియాతిబలం, బుఱని
తెగువ ముందట బెన్, గొఱలుట చిత్త
మున బెట్టుకొని విహరించెన్.
           భార. స్త్రీ పర్వ. 2 ఆ.

అఱచేత వ్రాలు గనువేళ

 • తెల తెలవారునప్పుడు.
 • అఱచేతి రేకలు కనబడు తుండగా అని యిప్పటికీ అంటారు.
 • "అఱచేత వ్రాలు గనున, త్తఱి బడె నొక యంపకట్టె..." ఆము. 7. 10.

అఱచేతిమాణిక్యము

 • అందుబాటులోని అమూల్య వస్తువు.
 • "శీతాంశుధరు డఱచేతిమాణిక్యంబు, కద్రూజకటకుండు గాదెకొలుచు."
 • శృం. శా. 4 పే. 82.
 • చూ. అరచేతి మానికము, కరతలా మలకము.

అఱచేతిది

 • సులభసాధ్యము, అందుబాటులోనిది.
 • "పరము నిహము నఱచేతిదే ప్రయాస మించుక లేదు. తాళ్ల. సం. 5. 265.

అఱచేతిబోగ్యము

 • అందుబాటులో నున్నది.
 • అరచేతిలోనిదానివలె అనుభవింప అతిసులభ మనుట.
 • "సర్వసామగ్రి నీ, యఱ చేతి భోగ్యము." హర. 4. 23.

అఱచేతిమానికము

 • అందుబాటులో నున్న అమూల్యవస్తువు, అఱచేతిలోని మాణిక్యము.
 • "ప్రతిదేవతలు నన్ను బయలు నెత్తిన దివ్వె, యఱచేతిమానిక మనుట దప్పె."
 • ఉ. హరి. 5. 92.
 • చూ. అరచేతి మాణిక్యము.

అఱచేతి యుసిరికాయ

 • సంపంగిమన్న శత. 7.
 • చూ. కరతలామలకము.

అఱచేతలోనిది.

 • అందుబాటులోనిది.