పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమసందర్శనము,ఇద్దరు యాత్ర, హరిజన యాత్ర, మన కర్తవ్యం" అను ఐదు విభాగాలలో గాంధీజీయొక్క సంగ్రహ జీవిత చరిత్ర, దేశసంచారము, ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా సమగ్రసంచారం, స్వాతంత్ర్యోదమ ప్రచారం, ఇద్దరు వస్త్రధారణ, విదేశీవస్తు బహిష్కరణ అస్పశ్యతా నివారణ, జాతిమత, కుల, వర్గ భేదాలకతీతమైన సుస్థిర సారిOుక వ్యవస్థను ఏర్పరుచుట, విద్యాలయాలు స్థాపించి, చక్కటి దేశీయ విద్యను ప్రోత్తహించుట, త్యాగశీలముధానధర్మములు, ఆత్మస్టెర్మము, క్రమశిక్షణ మొదలగు ఉదాత్త గుణాలనుఅలవరుకొనుట అను మహోన్లతాశయాలను గాంధీజీ ప్రబోధ తరంగిణిలో జాలు వారి నటు ಇಂದು కానవచ్చును.

పశ్చిమగోదావరిజిల్లా యొక్క రాజకీయ, సాంఘిక, సంస్కారాత్మక విన్యాస వైరియెర్వైలు, కొండా వెంకటప్పయ దండు నారాయణరాజు, ఆత్మకూరి గోవిందాచార్యులు, ఎర్రమిల్లి నారాయణ మూర్తి, మాగంటి బాపినీడు, మాగంటి అన్నపూర్ణాదేవి మొదలగు ప్రముఖ గాంధేయవాదులు విమల జీవిత సార్థకతలు ఇందు సుస్పష్టంగారతిబింబిసున్నాయి.

చరిత్రాధ్యాపకుడుగా, విషయ పరిశోధకుడుగా తాను సాధించిన ప్రగతికి, అనుభవజ్ఞానానికి, పరిజ్ఞాన పాటవానికి ఈ గ్రంథము ఒక ఆటపట్టుగా కానవచ్చు చున్నది. ఇది చదువరులకు చక్కని సందేశాలను అందించే ఉత్తమగ్రంథము.

ఈ ఆదర్శప్రాయ రచయిత యొక్క కమనీయ లేఖని నుండి ఇట్ එබීජ సద్దంథములను వెలయించుటకు తగిన శక్తి యుక్తులను, పరిపూర్ణ ఆయురారోగ్య సౌభాగ్వాలను ఆపరాత్తరుడు అనుగ్రహించుగాక!

తజస్వినావధీతమస్తు