పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

ఊబిలో కూరుకొనిపోయేటట్టు చేస్తూన్నాం. ఒక చెంప పై కొడితే మరి ఒక చెంప చూపమని మహాత్ముడు ప్రవచిస్తే, రెండు చేతులతో బాంబులు పట్టుకొని వీధులలో విశృంఖలంగా వీరవిహారం చేస్తూ, హత్యలు, మానభంగాలుచేస్తూ నీచనికృష్ణ కార్యక్రమాలలో పోటీపడుతున్నాం.

నేటి ఈ అశాంతితో నిండిన వాతావరణంలో ద్వేషం, హింస, స్వార్థం, భోగలాలసత, అవినీతి, అనైతికత విశృంఖలముగా పెచ్చురిల్లుతున్న కాలంలో గాంధీజీ జీవితం, ఆయన సిద్దాంతాలు, ఆయన జీవన విధానం అధ్యయనం చేయటం అత్యవసరం. ఆయన మార్గం సదా అనుసరణీయం. నేటి ప్రభుత్వాలకు ప్రజలకు అదే శరణ్యం. గాంధీజీ చెప్పినట్టు “ఆయన జీవితమే, ఆయన సందేశం.”