పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

సందేశాన్ని ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య చదివినిపించారు.

దేశ విభజనకు కాంగ్రెసు, ముస్లింలీగ్లు అంగీకరించిన తరువాత పంజాబు మతవర్గాల మధ్య యుద్దానికి కేంద్రంగా మారింది. ఇది 1947 ఆగష్టు 15న దేశవిభజన జరిగి దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత కూడ కొనసాగింది. దీని ఫలితముగా 1947 సెప్టెంబరు ఆఖరుకు 6,00,000 ప్రజలు మరణించారు. 140 లక్షల ప్రజలు తరతరాలుగా తామనివసిస్పూన్న ప్రదేశములను వదలి కాందిశీకులుగా భారతదేశానికి కొందరు, పాకిస్తాన్కు కొందరూ పారిపోయారు. 19 శాంతియుత సత్యాగ్రహ సమరం ద్వారా దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించాలని గాంధీజీ తలచారు. ఆయన చేసిన ఉద్యమాలన్నీ అలాగే సాగినవి. కాని చివరికి స్వాతంత్ర్యముతోపాటు దేశవిభజన జరుగుటవలన చరిత్రలో కనీవినీ ఎరుగని మానవమారణహోమం జరిగింది. అహింసా సిద్దాంతాన్ని దేశప్రజలందరికీ తాను సక్రమముగా బోధించలేకపోయినానని, అందుచే పరిణామములు ఇలా జరుగుచున్నాయని మహాత్ముడు తనను తాను నిందించుకొంటూ కుమిలిపోయినారు. ఎన్నో ఆలోచనలతో నిమగ్నమయి ఉన్న סחo& జీపై కొందరు యువకులు బిర్లామందిరమువద్ద ప్రార్థన చేసుకొంటుండగా 1948 జనవరి 20న బాంబుపేల్చారు. కాని గాంధీజీకి అదృష్టవశాత్తు అపాయంఏమీ జరుగులేదు. దారితప్పిన యువత చేసిన చర్యగా గాంధీజీ దానిని అభివర్ణించారు. గాంధీజీ హిందువుల ప్రయోజనములకు భంగకరముగా తయారైనాడని కొందరు మతోన్మాదులు భావించారు. ప్రభుత్వం ప్రత్యేకరక్షణ కల్పిస్తానంటే గాంధీజీ అంగీకరించలేదు.

1948 జనవరి 30వ తేదీ సాయంత్రము ఢిల్లీలోని బిర్గా గృహం నుండి గం| 5.05ని ఇరువైపులా తన మనుమరాళ్ళ అబా గాంధీ, మనూ గాంధీల భుజములపై చేతులువేసుకొని ప్రార్థనాసభకు వెళుతుండగా వేదిక సమీపములో నాథూరాం వినాయక్ గాడ్సే అనే హిందూమతతత్వవాది వంగి మహాత్మునికి పాదాభివందనం చేసినట్లే చేసి నాలుగుసార్లు రివాల్వర్తో కాల్పులు జరిపాడు. "హేరామ్, హేరామ్' అంటూ మహాత్ముడు ನೆಲ€°ರಿಗಿನಾಯಿ. వైరిని కూడా ప్రేమించే ప్రేమమూర్తి మతమూరుల చేతిలో బలియైపోయానారు. గాంధీజీ హత్యకు భారత దేశమేకాదు, యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ప్రపంచ రాజ్యాధినేత లందరూ భారత ప్రజానీకానికి ఓదార్పు సందేశాలు పంపారు. గాంధీజీ మరణం భారతీయు లందరినీ పెనుదుఃఖంలో మంచివేసింది. జాతిపితను కాపాడుకోలేని ప్రభుత్వం సిగ్గుతో తలవంచింది. అశేషజనావళి అశ్రుతప్త హృదయాలతో వెంటరాగా తెల్లవారి అంతిమయాత్ర