పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

బహిరంగ సభలో ఏలూరు తాలూకా బోర్డు వారు సన్మానపత్రంతో పాటు రూ.116/ - లు హరిజన నిధిని అందించారు. ఇంకా అనేక సంస్థలు గాంధీజీకి సన్మానపత్రాలు సమర్పించారు. గాంధీజీ ఆహ్వాన సంఘంవారు మోటమర్రి మల్లికారునుడు స్వయంగా సమర్పించిన రూ. 58/-లు తో కలిపి రూ. 116/–లు సమర్పించారు. పోలిశెట్టి రంగ నాయకులు రూ. 116/–లు, ఏలూరు తాలూకా బోరు ప్రశిడెంటు స్వయంగా రూ.116/–, పెదపాడు వాస్తవ్యులిరువురు చెరియొక రూ.116/–లు హరిజననిధికి అందచేశారు. శ్రీరామ భుజంగరావు, యం.రంగారావు గాంధీజీ బొమ్మలను వేసి సమర్పించారు. అనేక మంది స్త్రీలు తమ ఆభరణములను గాంధీజీకి స్వయంగా సమర్పించారు.

తదుపరి గాంధీజీ నిశ్శబ్దంగా ఉండమని కోరి 20 నిమిషములు ఉపన్యసించినారు. దూరశ్రవణయంత్రాలు ఉన్నందువలన ఆయన ఉపన్యాసం అందరికీ స్పష్టంగా వినిపించింది. హిందీ పరీక్షల్లో ప్రముఖముగా ఉత్తీర్ణులు అయిన వారికి ఆసభలో పతకాలను గాంధీజీ బహూకరించగలరని అంతకు పూర్వము ప్రకటింపబడింది. కాని గాంధీజీ ఆ పతకాలను తాను బస చేసిన గాంధీ జాతీయ విద్యాలయములో ఇవ్వగలనని ప్రకటించారు. తరువాత లాలాలజపతిరాయ్ చిత్ర పటమును ఆవిష్కరిస్తూ లాలాజీ అసమానదేశ సేవను గురించి అత్యంత ప్రశంసాపూర్వకముగా ఉపన్యసించారు. ఆ ఉపన్యాసంలో “&58 8°eა& సమయములో లాలాజీ యొక్క అమూల్య గుణగణములను గురించి నేను సంపూర్ణముగ తెలియచేయగలనని మీరు తలంచవలదు. వారి ఆమరణాంతము, వారి ఆంతరంగికులలో ఒకనిగా ఉండు భాగ్యము నాకు లభించినది. నేడు మీరును నేనును లాలాజీ వివిధ గుణములలో వారు అస్పృశ్యతా దురాచారము పై సల్చిన ఫరోరయుద్ధము ముఖ్యముగ గమనించవలెను. అంటరాని వారని పిలువబడుచున్న హరిజనుల ఎడల హిందూ సంఘము తన విధ్యుక్త ధర్మమును గుర్తించుటకు పూర్వమే లాలాజీ స్వకీయ అనర్గళగళవాహినితో అస్పృశ్యత ప్రబల దురాచారమని, అది హిందూ సంఘమునకు కళంకమని తీవ్రముగా ఖండించినారు. ఆయన అస్పృశ్యతపై చేసిన దండయాత్రయే, వారిని హిందూ సంఘమునందంతటా పూజారులను చేయుచున్నది. కాని భారతదేశమునకు సర్వతోముఖముగవారు చేసిన అపార కృషి ఎవరు మరవగలరు? వారి అఖండ సాహసము, నిర్భయత్వములనెవరు కాదనగలరు? పంజాబీయులేకాక అఖిల భారతదేశమంతయూ ఏక కంఠముతో వారిని 'పంజాబుకేసరి' అని అర్థరహితముగ పిలుచుట లేదు." 13 అని పేర్కొన్నారు.

గాంధీజీ ఆంధ్రదేశము నందు సంచారముగావించిన కాలములో ఆయన హృదయము