పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

అతిధి సత్కారాలను గాంధీజీ ప్రశంసించారు. రామరాజు గారి ఇంటివద్దనే స్త్రీలు సుమారు రూ. 1000/- విలువైన బంగారు ఆభరణములను, ధనాన్ని మహాత్మనికి సమర్చించారు. 12 రెండు గంటలు విశ్రమించి మధ్యహ్నం గంn 2.30 నిuలకు గాంధీజీ రామరాజుగారి ఇంటి నుండి ఏలూరు వెళ్ళేందుకు తాడేపల్లిగూడెం రైల్వేస్టేషనుకు బయలుదేరారు వెళ్ళారు.

గాంధీజీ రైల్వే స్టేషనుకు వెడలు మార్గములో "సతీహిత సమితి సభ్యురాండ్రు సుమారు 200 మంది, దామోజీపురపు వెంకట నరసింహరావు ఇంటి వద్ద మహాత్ముని కారును ఆపించి కర్పూరహారతి ఇచ్చి, సన్మాన పత్రము నొసంగి, రూ. 116/- సమర్పించారు. ఈ సమితి కార్యదర్శి యగు దామోజీ వరపు లక్ష్మీనరసమ్మ బంగారు గాజును సమర్పించారు. ఈ సభ్యురాండ్రు తమకు మహాత్ముడు ప్రత్యేక దర్శనమిచ్చినందులకు మిక్కిలి ఆనందించారు.

ఏలూరు, -

గాంధీజీ తాడేపల్లిగూడెం నుండి రైలులో పోవుచుండగా పూళ్ళ దెందులూరు, కైకరం, భీమడోలు రైల్వేస్టేషన్లలో పరిసరగ్రామస్తులు ఆయనను సందర్శించి హరిజననిధికై విరాళములు సేకరించి ఇచ్చారు. గాంధీజీ ఏలూరు రైల్వేస్టేషనులో దిగగానే పౌరులు ఆయనకు పూలదండలు వేసి సత్కరించారు. డాక్టర్ తాడేపల్లి అనంతశాస్త్రి గారి సతీమణి సత్యవతీ జయదేవి రూ. 116/- విలువ కలిగిన తన బంగారు గొలుసును, ఒక బంగారు కుంకుమ భరిణిను గాంధీజీకి సమర్పించారు. స్టేషను వద్ద నుండి ఆహ్వాన సంఘం వారు చేసిన ఏర్పాట్ల ప్రకారం గాంధీజీ ఆయన బృందము మున్సిపల్ కార్యాలయానికి చేరారు. అచ్చట మున్సిపల్ అధ్యక్షుడు మోతే నరసింహరావు సన్మాన పత్రంతో పాటు రూ.116/- హరిజననిధికి గాంధీజీకి సమర్పించారు. పశ్చిమగోదావరి జిల్లా బోరు ప్రశిడెంటు రావుసాహేబ్ బడేటి వెంకటరామయ్య నాయుడు తమ సన్మానపత్రంతో పాటు రూ.116/- వెండి పళ్ళెంతో సహా హరిజననిధికి సమర్పించారు.\

ఏలూరు వాటర్ వర్బుకు దగ్గరగా ఉన్న మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేయబడింది. ఏలూరు రైల్వేస్టేషను నుండి మైదానం వరకు ఏలూరులోని పడమర వీధి వ్యాయామ సంఘంవారు, స్థానిక స్కౌట్లు, కాంగ్రెసు స్వచ్ఛంద సైనికులు, రోడ్డుకు ఇరువైపుల నిలబడి గాంధీజీ నిరాటంకముగా సభాస్థలికి చేరేటట్లు ఏర్పాటుచేశారు. సభాస్థలంలో rveටඨිකී ఆసీనులయ్యేందుకు, ಎತ್ತನೆ వేదికను ఏర్పరిచారు. ప్రజలకు ఆయన వాక్కులు వినబడేందుకు దూరశ్రవణ యంత్రాలను ఏర్పరిచారు. గాంధీజీ ఆంధ్ర పర్యటనలో దూరశ్రవణయంత్రాలను ఉపయోగించటం అదే ప్రధమం. మహాత్ముడు CPජකීකාරයී 30 వేలమంది ప్రజాసమూహంతో సభాస్థలి నిండిపోయింది.