పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

పౌరుల తరపున డా|చొప్పెళ్ల సత్యన్నారాయణ మూర్తి ఆహ్వానించి వేదికపైకి తీసుకొని వెళ్ళారు. పాలకొల్ల పౌరుల పక్షాన డా|చొప్పెళ్ల సత్యన్నారాయణమూర్తి, నర్సాపురం లైgంలూSD ಬೌಲ್ಡಿ పక్షాన, బోరు అధ్యక్షులు గ్రంధి వెంకట రెడ్డి నాయుడు, నర్సాపురం తాలూకా స్త్రీల పక్షాన దిగుమర్తి రామలక్ష్మమ్మ తాలూకా హరిజనుల పక్షాన దాసరి వెంకటరావు సన్మానపత్రములను, పర్సులలో ఉంచిన హరిజననిధిని గాంధీజీకి సమర్పించారు. నర్సాపురం కళావంతుల సంఘము వారు సన్మాన పత్రమును. ఒక రజిత పాత్రను మహాత్మునకు సమర్పించారు. పాలకొల్ల యువజన అస్పృశ్యతా నివారణ సంఘమువారి తరపున డా| ఆచంట పెదగోపాలము సుమారు 200 మంది హరిజన బాలబాలికలకు ఖద్దరు దుసులను మహాత్ముని చేతులతో స్పశింపజేసి పంచిపెట్టారు.

ఉదార స్వభావుడు, ప్రముఖ వ్యాపారి అగు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి, వారి సతీమణి గాంధీజీని దర్శించి హెచ్చు మొత్తములను పాదపూజగా నిచ్చివారి ఆశీర్వాదములను పొందారు. సలాది మామిళ్ళయ్య కూడ కొంత ద్రవ్యమును పాద పూజగ నర్పించారు. ఇంకనూ కొందరు ఖద్దరు మొదలుగా గల వివిధ కానుకలను సమర్పించుకున్నారు.

తదుపరి డా|చొప్పెళ్ళ సత్యనారాయణమూర్తి శ్రీజనకాశ్రమమునకు శంకుస్థాపన చేయవలసినదిగా కోరుచూ సువర్ణతాపీని గాంధీజీ హస్తమున ఉంచగా మహాత్ముడు తాపీతో శంకుస్థాపనా శిలను స్పృశించి శ్రీజనకాశ్రమమునకు శంకుస్థాపన చేసినానని ప్రజలకు వెల్లడించారు. తరువాత బంగారు తాపీని వేలం పెట్టినారు. అద్దేపల్లి సత్యనారాయణమూర్తి దానిని రూ.100/-లకు కొన్నారు. కళావంతులు సమర్పించిన రజిత పాత్రను చోళ్ళ నరసింహమూర్తి రూ.80/-లకు, స్వాగతపత్రాలను బొండాడ వెంకటరత్నం గుప్త రూ. 15/-లకు వేలంలో కొన్నారు. ప్రశాంతముగా, ఆహ్లాదముగా జరిగిన పాలకొల్లు సభలో హరిజననిధి సుమారు రూ.1600/- చేకూరింది. ఇచ్చట గాంధీజీ తన ఉపన్యాసములో "ఈ శ్రీజనకాశ్రమము హరిజనులకు నిజమైన ఆశ్రయంగా ఉండవలెనని, హిందూ మతానికి కళంకదాయకంగా ఉన్న అస్పృశ్యత అనే అమానుష ఆచారాన్ని నిర్మూలించవలెనని" ప్రజలకు ఉద్బోధించారు. తదుపరి గాంధీజీ తన పరివారముతో భీమవరం వెళ్ళుచుండగా మార్గము నందు లంకలకోడేరు గ్రామస్తులు రూ.300/-లు, బల్లిపాడు గ్రామస్తులు రూ.50/- హరిజననిధికి సమర్పించారు.

బీమవరం

ఉదయం గం:19, 15ని|లకు గాంధీజీ భీమవరం వచ్చారు. గాంధీజీ రాకను పురస్కరించుకొని ఆహ్వాన సంఘము ఏర్పాటు చేయబడింది. దానికి తటవర్తి వీరరాఘవులు అధ్యక్షులుగాను, భూపతిరాజు రామమూర్తిరాజు కార్యదర్శిగాను, పాలకోడేటి