పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

ప్రజలు హాజరైనారు. సభలో రూ.200/-లున్నూ మరియు రూ. 50/- విలువ గల ఖద్దరు ಏನ್ರಲು గాంధీజీకి సమర్పించారు. గాంధీజీ ఐదు నిమిషములు ఉపన్యసించి Oগঞ্জ 9గం|లకు తణుకు బయలుదేరారు."

తణుకు

గాంధీజీ 26 వ తేదీ రాత్రి 8గం|లకు తణుకు విచ్చేయనున్నారని ప్రకటింపబడుటచే సుమారు రెండు వేల మంది స్త్రీ, పురుషులు ఎర్రమిల్లి రామనాధముగారి మేడ వద్ద మహాత్మునిరాకకై నిరీక్షించుచుండిరి. కాని మార్గము నందు ఆలస్యమగుటచే మహాత్మునికారు రాత్రి 10 గం|లకు వచ్చింది. మహాత్మునకు కావలసిన ఏర్పాట్ల చూచుటకు శ్రీమతి మీరాబెన్, ప్రా, మల్కానీ, శ్రీమతి ఉమాబజాజ్, శ్రీమతి కృష్ణాబెన్ మన్నగు పరివారము 20నిముందుగా వచ్చారు. గాంధీజీ రామనాధంగారి మేడపైకి వెళ్ళారు. అనుచరులు ఆయన పడక చుట్టను కూడ పైకి తీసుకొనివెళ్ళారు. గాంధీజీ నిదురించుటకేగిననూ జనసమూహము వెడలక పోవుటచే మహాత్ముడు మేడ ముందరి హాలులోనికి వచ్చి ప్రజలకు దర్శనమిచ్చారు. ముక్కుపై వ్రేలువేసికొని అల్లరి చేయవద్దనియు, అలసియుంటిననియు,

կի

ప్రశాంతముగా వెడలి పోవలసినదనియూ హిందీలో చెప్పారు. తరువాత ప్రజలందరూ ప్రశాంతముగ వెడలిపోయిరి. - మరునాడు 27వ తేదీ ఉదయం గాంధీజీ ప్రార్ధనలో అనేకమంది కాంగ్రెస్ కార్యకర్తలు, హరిజన కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనాడు వైకుంఠ ఏకాదశి కావటంచే తెల్లవారు జామున