పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

భూత చేతోమయుడు ; శ్రీశుకయోగి సదృశుడు; గాంధీ భగవానుడు. గింగురుమంటున్నాయి చెవులు, చుటూ ముసురుకొన్న జనుల జయజయ ధ్వనులతో నిత్యం లక్షలాది భక్తిపూర్వకకరాంగుళులు తనకు కానట్లు పరిగ్రహించే ఆ పరమపురుషుడు ఒక్క మారు వినీతుడై నిమీలితనేత్రుడై కరకమలాలు ముకుళించి అణువుకంటె అణువై" ఓమ్ నమో నారాయణాయ అంటూ తన చుటూ సహస్ర శీరుడై ; సహస్రాక్షుడై, సహస్ర పాదుడై అవతరించి ఇష్టదైవాన్ని మానసికోపాసనచేస్తూ భక్తిరసామృత సింధుగర్భంలో మునకలు వేస్తూ మహాసమాధి నిమగ్నుడైనాడు.

ఓహో! మహాత్ముని ఇన్నిసుందరాకృతులు చూచి ముగ్గుడనైనాను. కాని ఇట్లాంటి నిర్భర దివ్య సౌందర్యరూపం ఎన్నడూ ఎక్కడా చూడలేదు. వర్చస్వంతమైన ఆ విశాలఫాల పట్టిక పై "దేహబుద్ద్యాస్మి దాసోహం జీవ బుద్ద్యాత్వదంశకం ఆత్మబుద్ధ్యాత్వమేవాహం” అన్నపూర్ణసత్యం యొక్క వివిధ కళలు ద్రుత గతితో ప్రజ్వలించి అన్నట్లయింది. “ಭಿನಿಸ್ಬಿ! ూహన్దాస్ ధన్యోస్మి 99

“ప్రభూ ! నీ పాదకమలంబు నెమ్మిడగ్గరగాని తరలి పోవంగ పాదాలు రావు" ఈ స్వల్పకాలంలో "మామనంబులెల్ల మరపి దొంగిలి తెట్లు బ్రతుకు వారమేలాగు మేలాగు, ఏమిచేయువారమిక మహాత్మా అని శ్రీకృష్ణుడంతర్జానమైన తరవాత గోపికలనుభవించిన అవస్థలనుభవిస్తూ ఆ అమృతమూర్తిని హృదయ పేటికలో బంధించుకొని ధ్యానించు కొంటూ విధిలేక మళ్ళలేక అంతలో వెనక్కిమళ్ళినాను.

"స్థానేహృషీకేశ ! తవ ప్రకీర్యా
జగత్ర్పహ్భష్యత్యను రజ్యతే చ
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి
సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘూ8
కస్మాచ్చ తేన నమేరన్ మహాత్మన్
గరీయ సే బ్రహ్మడో ప్యాది కర్రే"

మహాత్మానీవు నరుడవు. కాని విశ్వరూపుడవు. నీ రూపం భూమి అంతా నిండినది పైగా 10 అంగుళాలు మిగిలినది. "అత్యతిష్ఠద్దశాంగులమ్" అజ్ఞలునిన్ను మానవ మాత్రునిగా గ్రహిస్తారు. కాని తత్త్వజ్ఞలు అసామాన్యుడవైన మహాత్ముడవంటారు. నీవకేవలం గాంధీవికావు. సమస్త భూత చేతోమయమూర్తివి, సమవర్తివి, అణువులోను, మహత్తునందు, పుణ్యనందు, పాపియందు, శునియందు శ్వపాకునియందు సర్వసమంగా