పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

నిదర్శనముగా నిర్మించిన ప్రాంతానికి 'లాలాజీనగర్ అని గాంధీజీ నామకరణం చేసి ప్రారంభించారు ఆ తదుపరి లాలాలజపతిరాయ్ దేశసేవలను వివరించారు. * ప్రజలు గాంధీజీకి సమర్పించిన వెండి గిన్నె ఖద్దరు ధోవతిని వేలము వేయగా న్యాయవాది టి.వి శేషావతారం, రూ. 35/–, రూ.8/-లకు కొన్నారు. నాలుగువేల గజాల ఖద్దరునూలు రూ. 10/-లకు విక్రయించారు.

ఉదయం 9 గం|లకు మహాత్ముడు, శ్రీమతి కసూరిబాయి, శ్రీమతి ప్రభావతి, ప్యారీలాల్ (గాంధీజీ ಪ್ರವೆಟಿ సెక్రటరీ), సుబ్బయ్య (సంక్షిప్త విలేఖకుడు), ఇమాంసాహేబ్, దేశభక్త కొండావెంకటప్పయ్య, వేమూరి నారాయణమూర్తి, నిడదవోలు వెంకటరావు, సుబ్బరామయ్య కలకత్తా మెయిల్లో ఉదయం 9.15 ని|ల బయలుదేరి విశాఖపట్నము వెళ్ళారు.

జీ ఖద్దరు యాత్ర, కొవ్వూరు.1929 గాంధీ

పశ్చిమగోదావరిజిల్లాలో గాంధీజీ ప్రచారం ప్రజలలో నూతనోత్తేజాన్ని కలిగించింది. ఆయన ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగాలు వారిలో జాతీయతాభావాన్ని స్వాతంత్ర్యోద్యమ పిపాసను రేకెత్తించాయి. ఖద్దరు నిధికి వారు ధారాళంగా విరాళములను అందించారు. గాంధీజీ ఏప్రియల్ 23వ తేదీ ఉదయం 7.30 ని|ల నుండి 28వ తేదీ ఉదయం గం:18 వరకు పశ్చిమగోదావరి జిల్లాలో 250 మైళ్ళ ప్రయాణం చేశారు.