పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

మహ్మాత్ముడు అనగా "రూ, 400/- ఇచ్చెదనని, నిరంతరము ఖద్దరు కట్టెదనని" దొరయ్యగారు వాగ్లానం చేశారు. అంత గాంధీజీ "మీభార్య ఇంతకు ముందే ఇచ్చటకు వచ్చి రూ.25/– లు ఇచ్చారు. ఆమె ఖద్దరు ನಿರಾಣಮಿ ఎడల తన ఆసక్తి వెల్లడించారు. మీరు ఆమె కృషికి ఎట్టి అభ్యంతరము వెల్లడించరాదు. &ရွှဉ့်ထဲသံ პ<6უoზ%Oტზ ಅನ್ನಿಪುಣರಾದೆವಿ ఎట్లు పనిచేసిరో మీరు వినియుండలేదా ! నాలుగు రోజుల క్రితము ఎలమంచిలి సత్యవతీదేవి రూ. 1,400/ —లు విలువ గలిగిన నగలు ఇచ్చుటయైనా తెలియదా!" ** అని గాంధీజీ అన్నారు.

తణుకు

27వ తేదీ తెల్లవారుజామున గాంధీజీ ఆచంట నుండి తణుకు ప్రయాణమైనారు. మార్గంలో ఆచంట విడచిన పిమ్మట భర్తను కోల్పోయిన ఒక పేద బ్రాహ్మణ యువతి మహాత్ముని దర్శించి రూ.100/- లు ఖద్దరు నిధికి సమర్పించింది. పెనుగొండ యందు రూ. 500/-లు, ఏలేటిపాడులో రూ. 500/- లు ఒసంగబడింది. గాంధీజీ ఉదయం గం|7-10ని|లకు తణుకులో సభావేదిక వద్దకు చేరుకున్నారు. סחo&c8 275 386 ఉదయం వచ్చెదరనే వార్త తెలిసి చుట్టుప్రక్కల గ్రామములనుండి వేనవేల ప్రజానీకం 26వ తేదీ రాత్రి హైస్కూలు గ్రౌండునకు వచ్చిచేరారు. సుమారు 20 వేల జనవాహినితో క్రిక్కిరిసియున్న సభయందు గాంధీజీ ప్రవేశించారు. చుటూ ఈలచెట్లు ప్రశాంతముతో බ්ථaඨයීට් స్వచ్ఛంద సైనిక దళమువలె కనబడుచుండెను. ఉదయభానుని సూర్యకిరణములు జనులకు ఉల్లాసము కలిగించుచుండెను. స్వచ్ఛంద కాంగ్రెసు వాలంటీర్లు బారులుతీరి నిలబడియున్నారు. సభయందు ప్రశాంతమైన వాతావరణము అమరియున్నది. గాంధీజీ సభయందు అరగంటసేపు ఉన్నారు. పుణ్యాంగనలు నీరాజనములు ಇಮ್ಲೀಗ್, వృదులు మహ్మత్ముని పాదములపైబడి దోషములు హరింపుమని, దవడలపై కొట్టుకొనుచుండిరి. తణుకు పౌరులు రూ.400/-, బోర్డు హైస్కూలువారు రూ.116/–, ముళ్ళపూడిరాయుడు రూ.100/-, దువ్వ గ్రామసులు రూ.232/- వడూరు గ్రామసులు రూ. 116/– సమర్పించారు. గాంధీజీ ముళ్ళపూడి రాయుడు గారితో "మీరు కోటీశ్వరులగుటచే రూ.100/- చాలదు" అన్నారు. ఈ గ్రామము వదలి వెళ్ళలోపుగా ఇంకా హెచ్చుమొత్తము ఇచ్చెదనని రాయుడుగారు తెలిపారు. కొందరు ఉంగరములు, కొత్త ఖద్దరు వస్త్రములు, గడియారములు కానుకలుగా అర్పించారు. కొందరు మహ్మత్ముని పాదములపై పడి