పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

మహాత్మునకు రూ.800/- కొడమంచిలి గ్రామసులు రూ. 63/- దేవ గ్రామస్తులు రూ. 178/- ఖద్దరు నిధికి సమర్పించిరి. కొంతమంది డబ్బు ఇచ్చుటకు సంకోచించు చున్నట్లు చూచి గాంధీజీ తన ఉపన్యాసంలో "దొరయ్యగారు మీరు గ్రామమున లక్షాధికారులు ಇಲ್ಲೆ వారు ఇచ్చట చాలా మందికలరు. ఇట్టి సంపన్న గ్రామమున రూ.800/- ఇచ్చుట తక్కువే. మీరు ఇంకనూ హెచ్చు సంఖ్యలో ఇవ్వాలి. నన్ను నడచివచ్చునట్లు చేసినందులకైననూ మీరు హెచ్చగానియ్యవలెను. నేను మీ గ్రామమునుండి వెళ్ళలోగా మీరు ఆ లోటును భర్తీ చేయవలెను. ఖద్దరు విషయమున మీరు లుబ్ధత్వమును చూపరాదు. ధనవంతులు ఎంత ఇచ్చినా తక్కువే యగును కావున మీరింకా ఇవ్వవలెను అన్నారు. తరువాత సంభాషణ కోనసాగిస్తూ ఆచంటలో కొన్ని సంవత్సరముల క్రితము వరకూ చాలా రాట్నములు పనిచేసూ ఉండేవని విన్నాను. ఆ నూలుతో చేయబడిన వస్రాలనే గ్రామస్తులు వాడేవారని విన్నాను. అవి ఇప్పడు ఎందుకు ఆగిపోయినవో తెలియదు. ఆ నూలుపనిని పునరుద్దరించవలెనని కోరుచున్నాను. ప్రతియింటా కనీసము ఒక రాట్నమైనా తిరుగుచుండవలెను. ఖద్దరును ప్రేమిస్తున్న నేటి యువకులు అందుకోసము గట్టిగా కృషి చేయవలెను. వారు మద్యపాననిషేధము, విదేశీవస్త్ర బహిష్కారము, అస్పృశ్యతా నివారణ, ಛದ್ದಿಯಿ ప్రచారము విరివిగా సాగించవలెను. ఐక్యముగా వ్యవహరించవలెను. మత విభేదములు కలుగరాదు. మాలమాదిగలు మన్నగువారిని పాఠశాలలకు రానీయవలెను. వారికి కూడా చదువు చెప్పవలెను. వారికి కూడ రాట్నములు ఇచ్చి నూలు ఒడికించవలెను. ఖద్దరు ప్రచారముచేస్తూ కాంగ్రెసు కార్యక్రమము సక్రమంగా నిర్వహిస్తూ 1929 సంత్సరాంతంలో స్వరాజ్యసంపాదనకు జరిగే మహత్తర ప్రయత్నానికి సంసిద్దులుకాగలరని ఆశిస్తూన్నాను" అని పేర్కొన్నారు.

ఆరోజు రాత్రి గాంధీజీ నెక్కంటి దొరయ్యగారి గృహమున విశ్రమించారు. మాటల సందర్భంగా “ఈ గ్రామమున ఇవ్వబడిన రూ.800/-లలో దొరయ్య గారివి రూ.50/– మాత్రమే. మీకు ఆతిధ్యమిచ్చిన వారును, జిల్లాబోరు ఉపాధ్యక్షుడును అగు దొరయ్యగారి వంటి సంపన్నుడు రూ. 50/- ఇచ్చుట మిక్కిలి తక్కువ" అని ఎవరో అన్నారు. అంతట గాంధీజీ దొరయ్యగారిని పిలిపించి వివరము అడిగారు, అంత దొరయ్యగారు రూ.50/- ఇచ్చినట్టు ఒప్పకొన్నారు. " మీ వంటి హూందాయైన మనుష్యులు రూ.50/- ఇవ్వటమా" అని మాగంటి బాపినీడు సరసముగా దొరయ్యగారిని ఉద్దేశించి అన్నారు. “మీరు నిరంతరము ఖద్దరు ధరించవలెను. మీ దర్బారుకు తగినటుల ధనమీయవలెను" అని