పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

తినినసరిపోవును కాని, పరులసొమ్ముతో పెరుగు, నేయి, పిండివంటలు, పక్వాన్నములు భుజించుట పాడిగాదని బోధించారు.

సాయంత్రం గం|5-30ని|లకు బహిరంగసభ జరిగెను. సభకు సుమారు ఎనిమిది వేల మంది పౌరులు హాజరైనారు. గాంధీజీకి మున్సిపల్ కొన్సిలువారు, తాలూకా ಬೌಲ್ಡಿ వారు, వైశ్య, క్షత్రియ, వర్తక సంఘములవారు సన్మాన పత్రములను సమర్పించారు. సుమారు రూ. 1,500/- ఖద్దరు నిధి చేకూరింది. గాంధీజీ తన ఉపన్యాసంలో "పాలకొల్లులో విదేశీ బట్టల దుకాణములు హెచ్చుగానున్నవని వింటిని. అది చాలా విచారకము. మీరు విదేశీవస్త్రములను బహిష్కరించవలెను. విదేశీ వస్త్రవ్యాపారాన్ని నిలుపుదల చేయవలెను. మీరు మాలమాదిగలను చాలా ఇబ్బందిపెట్టుచున్నారని, వారి పిల్లలను పాఠశాలలోనికి రానీయటంలేదని విన్నాను. వారి పిల్లలను పాఠశాలలోనికి రానిచ్చుటయేకాక, వారికి ఉచితముగా పాఠములు చెప్పవలెను. దానివలన మనకు లాభమే కలుగును, కాని నష్టము కలుగదు. పంచములను దుకాణముల వద్దకు రానీయటం లేదని విన్నాను. అది పంచములలో నిరాశకు కారణమవుతుంది. కులీనులమనుకొనేవారు పంచములను తమ సోదరులుగా చూడవలెను అని బోధించారు.

ఆచంట

పాలకొల్లు నుండి ఆచంట చేరులోపున గాంధీజీ కారులో నిద్రించారు. ప్రతీగ్రామము నందు ప్రజలు వేలవేలుగా గుమిగూడియుండిననూ ఆచంట చేరువరకు మహాత్మునకు మెలకువరాలేదు. ఆచంట గ్రామంలో కొత్తగా తవ్వచున్న చెరువుగట్టు వద్ద Теодаš పయనించే కారు మట్టిలో కూరుకొనిపోయింది. గాంధీ మండుటెండలో దారిసరిగా లేకున్నను పావకోళ్ళ తొడుగుకొని ఆ మిట్టపల్లపు నేలలో, కసూరిబాయితో కలిసి సభాస్టలికి నడవవలసి వచ్చింది. దారినునుపుగా లేదు చాలా ఒడిదొడుకులుగా ఉంది అని ఒక కార్యకర్త అనగా నిజమే మన జీవితమంతా కూడ ఒడిదొడుకుగానే ఉంది అని మహాత్ముడన్నారు. మహాత్ముడు మాట్లాడుచుండగా అకస్మికముగ ఒక పాము వచ్చింది. ఇది విషసర్పము కాదు బురదపాము అని ఒకరన్నారు. "విషసర్పము కూడ మహాత్ముని సన్నిధిని విషరహితమగును" అని మంగిపూడి పురుషోత్తమశర్మ వ్యాఖ్యానించగా, 'అలాగా అని మహత్ముడు పకపక నవ్వెను

సభావేదికపై ఆచంట పౌరులపక్షాన జిల్లా బోరు వైస్ ప్రసిడెంటు నెక్కంటి దొరయ్య