పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

-పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

మట్లపాలెం చేరారు. ప్రముఖ కాంగ్రెసు నాయకుడు, (স্পেৰ্ম9 59%, గాంధేయవాది అగు పేరిచర్ల సుబ్బారాజు గ్రామస్తులతో ఎదురేగి స్వాగతించారు. సుమారు 5,000 మంది స్త్రీ, పురుషులు ఏతెంచిన బహిరంగసభలో గాంధీజీ ఉపన్యసించారు. అక్కడి జాతీయ పాఠశాలను సందర్శించారు. గ్రామస్తులందరూ ఖద్దరు ధరించవలెనని, విద్యార్ధులు ఖద్దరునేయుట, ధరించుట అలవాటు చేసుకొనవలెని ఉద్బోదించారు. ఎలమంచిలి గ్రామస్తులు రూ.150/- ఖద్దరు నిధికి ఇచ్చారు. ఎలమంచిలి గ్రామమునకు చెందిన ఎలమంచిలి గోపాలకృష్ణయ్య రూ.150/- విలువ కలిగిన వాచీని గాంధీజీకి సమర్పించుకొన్నారు.

మట్లపాలెంనందు పెనుమంట్ర వాస్తవ్యులయిన డా|| దాట్లనీలాద్రిరాజు మట్లపాలెమునందలి జాతీయ పాఠశాలకు సుక్షేత్రమయిన 10 ఎకరములు భూమిని గాంధీజీ సమక్షంలో దానము చేశారు.21 పేరిచర్ల సుబ్బరాజు తన గ్రామమునందు వసూలు అయిన రూ. 600/-ను ఖద్దరునిధికి సమర్పించారు. తరువాత గాంధీజీ విశ్రాంతి కొరకు పాలకొల్లకు ఉ18.30ని బయలుదేరినారు. చాలా అలసియున్న కారణమున సాయంత్రము వరకు కార్యక్రమములు వాయిదా వేశారు.

పాలకొలు

గాంధీజీ పాలకొల్లు ఉదయం 9.15 ని|లకు తన అనుచరులతో చేరారు. ఒక పాఠశాలలో బస ఏర్పాటు చేశారు. బసలో తగిన ఏర్పాట్ల జరుగలేదు. అనేక మంది ప్రహరీగోడలు దూకి గాంధీజీని తడికెలనుండి చూచుచుండిరి. తాగుబోతులను కూడా ఎవరూ నిరోధించలేదు. గాంధీజీకి వారు చేసెడి అల్లరి మిక్కిలి అసౌకర్యము కలిగింది. మహాత్ముని అనుచరులుకూడ ఇబ్బందులు పడినారు. సాయంత్రము 4 గం|లకు విశ్రాంతి అయినపిదప గాంధీజీ తాను విశ్రమించిన గదికి వెనుకప్రక్క మరియొక గదిలోనికి వెళ్ళారు. గాంధీజీ, వారి అనుచరుల నిమిత్తము పండ్లు, కూరగాయలు కోకొల్లలుగా ఉంచబడ్డాయి. గాంధీజీ వాటిని చూసి తన అనుచరులతో మనమింత తిండిపోతులమగుట విషాదకరమని, ప్రజాధనమును ఇట్లు మితి తప్పి ఖర్చుచేసి విందులారగించుట యుక్తము కాదని అన్నారు. సన్మానసంఘము వారిని వారించి ఆ పదార్ధములన్నింటిని అచటనుండి పంపించి వేశారు.22 తరువాత ఎందరో నిరుపేదలు పూటకైన గంజిలేక శోషిలుచుండ మనము విందులారగించుట తగదని, కేవలము ఆకలి నివారణ కొరకు తగిన సామాన్య పదార్ధములు