పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో 0మహాత్ముని సOూరము

సన్మాపత్రము వేలం వేయుచున్న గాంధీజీ

కుమార్తె, రాజమండ్రి స్త్రీ సనాతన విద్యాలయములో చదువుతున్న 11సం!! బాలిక చేతిబంగారు గాజులజతను, గంగరాజుగారి భార్య చంద్రయ్య మరి ఒక గాజుల జతను, గంగరాజుగారి మేనకోడలు, మరియూ కలిదిండి పుల్లయ్యగారు చెరి ఒక ఉంగరమును గాంధీజీకి సమర్పించారు. దామోజీవరపు నరసింహరావు కుమారై రూ.20/– తదితరులు గాంధీజీ పాదములను స్పృశించి ధనము సమర్పించు కొన్నారు. ఎల్లమిల్లి నివాసి వెలగలేటి సుబ్బారాయుడు తానే స్వయంగా తయారుచేసిన 80వ నంబరు నూలు వస్త్రముల జత గాంధీజీకి సమర్పించి పాదాభివందనం చేశారు. పిమ్మట గాంధీజీ సన్మాన పత్రము లను తీసుకొని వాటిని వేలము వేశారు. ముందుగా వర్తకసంఘము వారు ఇచ్చిన ధనము చాలదు కనుక వారే వేలము పాడవలెనన్నారు. అంత వర్తకులలో ప్రముఖులయిన గుజరాత్వాసి రైసుమిల్ల యజమాని) రమేశ్లాల్గారిని గాంధీజీకి పరిచయము చేశారు. సన్మాన పత్రముపాట ప్రారంభము రూ.10/- అన్నారు. తక్కువ అని గాంధీజీ అనగా, అంతట రూ. 50/- అన్నారు. అదియూ చాలదని గాంధీజీ అన్నారు. అంత గంగరాజుగారితో రమేశ్లాల్గారు సంప్రదించారు. ఇది చూసిన గాంధీజీ గంగరాజుగారితో మీరు నా తరపున వకాలా తీసుకొనండి అన్నారు. అంతట రూ.200/-కు పాటను కొట్టివేసి రమేశ్ లాల్ గారికి గాంధీజీ ఆ సన్మానపత్రాన్ని స్వయంగా అందచేశారు. తరువాత గాంధీజీ 5,000 మంది