పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము
గౌరవమెజిస్టేటు పదవులకు రాజీనామాలు సమర్పించారు. నర్సాపురంనందు సౌదాగర్ యూసఫ్ ఖూన్ తన 'జహందర్ భిరుదాన్నిత్యజించారు. విద్యాలయాలను బహిష్కరించవలెను అనే కార్యక్రమం ప్రకారం చంద్రుపట్ల బాపిరాజు, వడ్లపట్ల గంగరాజు, కలగర కృష్ణారావు, బద్దిరాజు నాగభూషణం, మంగిపూడి పురుషోత్తమశర్మ, దాట్ల సీతారామరాజు, నిడమర్తి వెంకట ఉమామహేశ్వరరావు మొదలగు విద్యార్థులు తమ చదువులకు స్వస్తి చెప్పారు. గజవల్లి రామచంద్రరావు, ప్రతివాది భయంకర కృష్ణమాచార్యులు, సత్తిరాజు రామమూర్తి, గొట్టముక్కల వెంకన్న శనివారపు సుబ్బారావు మొదలగు జాతీయ భావములు గల ఉపాధ్యాయులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. దండునారాయణరాజు, ఎర్రమిల్లి మంగయ్య, తల్లాప్రగడ చలపతిశర్మ, అతోట వీరరాఘవరాపు, ఎర్రమిల్లి నారాయణమూర్తి, అడవి బాపిరాజు మొదలైన న్యాయవాదుల ప్రభుత్వన్యాయస్థానాలను బహిష్కరించారు. పేరిచర్ల సుబ్బరాజు, మందలపర్తి తిమ్మరాజు, గొట్టముక్కల వెంకటపతిరాజు, చిటూరి ఇంద్రయ్య బోళ్ళప్రకాశం, మొదలగు 55 మంది గ్రామోద్యోగులు తమ పదవులకు రాజీనామా ఇచ్చారు.
విదేశీవస్త్ర బహిష్కరణ కార్యక్రమాన్ని జిల్లా ఎంతో దీక్షతో కొనసాగించినది. అనేకమంది కాంగ్రెసు కార్యకర్తలు జిల్లా అంతా పర్యటించి గాంధీజీ ఆశయాలను ప్రచారం గావించి, విదేశీ వస్తాలను గుట్టలుగా వేసి తగులబెట్టారు. స్వదేశీ వస్తాలను వాడవలసినదిగా ప్రోత్సహించారు. సహాయనిరాకరణ ఉద్యమాన్ని ప్రచారం చేసిన జిల్లాకు చెందిన ఏకైక స్త్రీ రత్నము మాగంటి అన్నపూర్ణాదేవి. జిల్లాలో అనేక ఖాదీ విక్రయశాలలు ప్రారంభించారు. ఖద్దరుధారణ, గాంధీటోపీ అహింసా వ్రతులకు సంకేతముగా గుర్తించబడింది. గాంధీ చిత్ర పటములు జిల్లా అంతా వ్యాపించాయి. అనేక మంది జనసామాన్యం కాంగ్రెసు నందు సభ్యులుగా చేరారు. నిర్మాణకార్యక్రమాలలో కూడా జిల్లాముందంజ వేసింది. ఉద్యమకారులు ప్రభుత్వన్యాయస్థానాలు బహిష్కరించి వాటి స్థానే పంచాయితీ కోర్టులు స్థాపించారు. కుముదవల్లి, శృంగవరము, పురుషోత్తమపల్లి, మట్లపాలెం మున్నగు గ్రామము లలో పంచాయితీ కోర్టులు స్థాపించి వివాదములను గ్రామములందే పరిష్కరించారు. పంచముల అభివృద్ధికై అనేక కార్యక్రమాలు చేపట్టబడినవి. అనేక పాఠశాలలను స్థాపించారు. వారిలో విజ్ఞానాన్ని పెంపుదలచేయుటకు సభలను నిర్వహించారు. ఉమర్ OMV ఆలీషా, దండు నారాయణరాజు, వెల్లంకి కృష్ణమూర్తి, మంత్రిప్రగడ మార్కండేయులు