పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

-పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

ఉత్కళ దేశమువలె గాదు. అదినిండు శక్తితో విరాజిల్లుతున్నది. ప్రజలు బలవంతులు, శక్తివంతులు, ఉదారవంతులు, పట్టుదలగలవారు, ప్రేమపూరితులు, స్వరాష్ట్ర భావిస్థితి గూర్చి, హిందూదేశ భావి భాగ్యోదయమునుగూర్చి వారికి విశ్వాసముకలదు.స్త్రీలకును, పురుషులకును కావలసినన్ని బంగారునగలు కలవు. ఆ నగలను నాకు కనబరచుట కడు నష్టదాయకము. తిలక్ మహారాజ్గారి జ్ఞాపకార్థం స్వరాజ్యం కొరకు అవినాకు కావలెనని మర్మము విడిచి అడిగితిని. స్త్రీలు, పురుషులు సంతోషపూర్వకముగా నాకు ఇచ్చిరి. ఆంధ్రదేశంలో ఆరురోజుల సంచారములో 50 వేల రూపాయలు నాకు ఇచ్చారు. స్త్రీలకు సహజ వినయ, సద్దుణములు కూడ చేరియున్నవి. ఇదిమిగుల ప్రశంసా వాక్యమని నాకు తెలుసు. నా అభిప్రాయమును నేను మార్చుకొనను. ఇటీవలనే వివాహితయై కలకత్తాలో విద్య నేర్చుకొనుచున్న అన్నపూర్గాదేవియను బాలిక మంగళసూత్రము తప్ప మిగిలిన సొమ్ములన్నింటిని "స్వరాజ్యనిధి'కి విజయవాడ సభలో నాకు సమర్పించి, సంపూర్ణ ఖద్దరు వస్త్రధారిణియై సమావేశమున పాల్గొనినది. ఆంధ్రదేశ స్త్రీ పురుషుల ఔదార్య స్వభావములు నన్ను ఎక్కువగా ఆకర్షించినవి". 7

గాంధీజీ ఏలూరు పర్యటన పశ్చిమగోదావరి జిల్లా ప్రజానీకంపై ప్రగాఢ ప్రభావాన్ని కలిగించింది. జాతీయ విమోచనోద్యమానికి తాము చేయగలిగిన కృషిని శక్తి వంచన లేకుండా ప్రారంభించారు. చాలా మంది ఖద్దరు ధారణకు ప్రతినబూని రాట్నం వడకటం ప్రారంభించారు. అంతవరకూ పరదాలో ఉన్న అనేకమంది స్త్రీలు ఉద్యమంలో ప్రవేశించి కార్యోన్ముఖులైనారు. విదేశీవస్తాలను గుట్టలుగా వేసి తగులబెట్టటం, షాపులు పికెటింగు చేయటం జరిగింది. కల్లు, సారాయి దుకాణములు పికెటింగు చేయటం-ఈత, తాడి చెట్ల నరికివేయటం- ఆబ్కారీవేలంపాటలు స్తంభింపచేయటం చేశారు. అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు, మునసబు, కరణములు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. విద్యారులు పాఠశాలలను బహిష్కరించారు. అహింసాయుత విధానాలతో గాంధీజీ అడుగుజాడలలో పశ్చిమ గోదావరి జిల్లా వాసులు సహాయనిరాకరణ ఉద్యమాన్ని అత్యంత ఉత్సాహంతో నిర్వహించారు.\

సహాయనిరాకరణ ఉద్యమతీర్మానం నందలి యోగ్యతాపత్రాలు, బిరుదులు పరిత్యజించవలెననే కార్యక్రమాన్ని అనుసరించి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నందు తటవర్తి పట్టాభిరామయ్య, పస్తుల సాగరం, మరియూ సత్యదేవర రామేశ్వరరావు తమ