పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

--పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

భగవదంశా సంభూతులగు అవతారపురుషులు జన్మించుచుందురు. అట్టివారిలో నీవొక్కడవు. నేటికి భగవదీయ దర్శన స్పర్శాదులచే మాప్రదేశము పావనమైనది. మన భారత వర్షము ప్రాచీనవిధానములను మరచి పాశ్చాత్య నాగరకత అను మహాసముద్రమున మునిగి పోవనున్న ఈ సమయములో నీవవతరించి ఋషిప్రోక్తములగు సత్య, శౌచాది గుణంబులు ప్రజలమనంబుల నెలకొల్పి అహింసావిధానంబున భారతపుత్రులకు స్వరాజ్య ప్రదానమును గావింప సమకట్టి తన్మూలమున లోకవిజయము గాంచనెంచితివి. దానికి ప్రధమ సోపానంబుగ హిందూ, మహ్మదీయ సోదర సమ్మేళనమును సమకూర్చితివి. భారత వర్షమును కష్టపరంపరల ముంచి పీడించుచున్న దాస్యాన్ని దౌర్జన్యరహితమగు సహాయనిరాకరణముచే నిర్మూలనము గావింప బూనితివి. నీ పాదపద్మములననుసరించి కార్యనిర్వహణ మొనర్చ సమకట్టిన మమ్ము ఆశీర్వదించి మాపురమున జాతీయవిద్యా పీఠమును స్థాపింప బ్రార్థించుచున్నారము. భారత వర్షమునకు సత్వరస్వరాజ్యమును సమకూర్చుటకును, లోకమునందెల్లెడల శాంతిని నెలకొల్పుటకును పరాత్పరుడు నీకు చిరకాలాయురారోగ్యముల నొసంగి నీకుటుంబమును సాకునుగాక అని మిగుల వేడుకొనుచున్నాము".

భవదీయ, భక్తులు,
హేలాపురి దీక్షా సంఘము.

ఈ సందర్భమునందు స్త్రీ ప్రార్థనాసమాజము వారు సమర్పించిన సన్మానపత్రము ఈ విధముగానున్నది.

"ఏలూరు స్త్రీ ప్రార్థనా సమాజము పక్షాన శ్రీ మహాత్మాగాంధీ దంపతులకు సమర్పింపబడిన వినతి పత్రిక.

మహాత్మా జననీ,

పరదేశీయ నిరంకుశ పాలనమున నామావశేషమై విషమావస్థయందు జిక్కి నిలయముగా నుండిన ప్రాచీన భారత వైభవమును బునరుద్దరింప భగవానుడు మిమ్ము సృజించెననుట స్తుతిపాఠముకాదు. 1857వ సం॥న భారతీయస్వాతంత్ర్య రక్షణమునకై, ఆత్మగౌరవమునకై భారత ఖండంబున విజృంభించిన భయంకర సంగ్రామము గాని, దాదాభాయి నౌరోజీ, లోకమాన్య బాలగంగాధర తిలక్‌లకు, స్కాట్, వెడర్బరన్ మహామహులచే స్థాపితమై 35 సం॥ వ్యాహతముగ, రాజకీయ రంగమున భారతీయ

26