పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము --

 గాంధీజీ ఏలూరును సందర్శించిన సందర్భములో గాంధీ జాతీయ విద్యాలయాన్ని గూర్చి కొంత చెప్పివలసియుంది. సహాయనిరాకరణోద్యమంలో భాగముగా ప్రభుత్వ పాఠశాలను నెలకొల్పాలని గాంధీ పిలుపునిచ్చారు.

సర్దార్ దండు నారాయణరాజు
పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్ రథసారధి

ఆ సందర్భాన్ని అనుసరించి ఏలూరు నందు జాతీయ పాఠశాలను ఏర్పరచాలనే ఉద్దేశముతో మానేపల్లి సూర్యనారాయణ, తమ్మన మాణిక్యం, పసుమర్తి పురుషోత్తం, కంభంపాటి కన్నయ్య అనే నలుగురు వైశ్య ప్రముఖులు ఒక దీక్షా సంఘముగా ఏర్పడి ఈ విద్యాలయస్థాపనకై ఒక లక్ష్మరూపాయలు చందాలు వసూలుచేయాలని, విద్యాలయస్థాపన పూర్తి అయ్యేంతవరకూ ఇండ్లకు పోరాదని దీక్షవహించారు. వీరు తమ దీక్షాసంఘానికి పురప్రముఖుడైన మోతే గంగరాజు గారిని అధ్యక్షునిగా ఎన్నుకొన్నారు. 1921 ఏప్రియలు నందు గాంధీజీ ఏలూరు రాకను పురస్కరించుకొని, ఆయన చేతుల మీదుగా, గాంధీజీ పేరున విద్యాలయ సంస్థాపన జరిపించాలని ఈ దీక్షా సంఘం సంకల్పించింది. నాటికి రూ. 62,488/- మాత్రమే వసూలుచేయగలిగారు. గాంధీజీ ఏలూరు వచ్చిన సందర్భమున దీక్షా సంఘము కోర్మెను అంగీకరించి గాంధీజీ, కస్తూర్బాతో కలిసి ఏప్రియల్ 3, 1921, ఆదివారం రౌద్రి నామసంవత్సరం, ఫాల్గుణ బహుళ ఏకాదశి రోజున మార్కండేయస్వామి వారి సన్నిధిలో బాలురకు అక్షరాభ్యాసము చేయించి గాంధీ జాతీయ విద్యాలయాన్ని సంస్థాపన చేశారు ఈ సందర్భమున దీక్షా సంఘమువారు గాంధీజీకి సమర్పించిన స్వాగతపత్రము ఈ దిగువునఉన్నది

దీక్షా సంఘమువారి స్వాగతపత్రము

"హేలాపురి దీక్షా సంఘమువారు శ్రీయుత మహాత్మా మొూహాన్ దాస్ కరుణా సాంద్ర గాంధీగారి కొసంగిన స్వాగతము.

మహాత్మా! లోకము పాపభారమునకులోనై ఐహిక సౌఖ్యాంధకారమున మునిగినపుడెల్ల

25