పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

మావైపు తయారగుటలేదు. మీరు విజ్ఞానములో, పట్టుదలలో, కార్యశూరతలో చాలా ముందంజలో ఉన్నట్లుతోసూంది. దక్షిణాఫ్రికాలో నా ఉద్యమంలో నాతో ప్రారంభం నుండీ ఊతగాచేరి పనిచేసిన వారు కూడ మీరే. చివరి వరకూ నాతో మిగిలిన వారు కూడ మీరే. ఇదినాకు బాగా జ్ఞాపకమున్నది.

సోదరులారా! ఆంగ్ల భాష తెలియని వేలాది మందిగల ఈ సభలో నేను ఇంగ్లీషులో మాట్లాడవలసి వచ్చినందుకు, నేను మాట్లాడే అతిసులువైన చిన్న చిన్న హిందుస్తానీ మాటలను తెనుగులో చెప్పగలవారొకరైనా ఇక్కడ లేనందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను. కాబట్టి ఇంతకు ముందు ప్రారంభించిన జాతీయ విద్యాలయములోని ఉపాధ్యాయులు తప్పకుండా ఈపట్టణంలోని ఈ పెద్దలోపాన్ని సరిదిద్దగలరని ఆశిస్తాను. మీ పాఠశాలలో ఈ సంవత్సరము రాట్నముపై నూలు తీయటం, హిందీ భాష నేర్పటం ముఖ్య కార్యక్రమాలుగా ఏర్పరచుకొని దేశోద్ధరణకు పూనుకొనవలెనని ప్రార్ధిస్తూన్నాను.

ఒక్కవిషయమును చెప్పి ఉపన్యాసమును ముగిస్తాను, అది ప్లీడరులను గురించి. నా ఉద్యమములో ఇంకా చేరకుండా వెనుకబడియున్న మహానీయులగు ప్లీడరులకు త్యాగమును, దూరదృష్టిని, దేశసేవాతత్పరతను భగవంతుడు అనుగ్రహించును గాక! అని ప్రార్థించుటయే నేను వారికి చెప్పదలచిన విషయము."

ఉపన్యాసము పూర్తి అయిన తరువాత 'తిలక్ స్వరాజ్యనిధి'కి చందాలు వసూలు చేయటం ప్రారంభమైనది. సభలో ఉన్నవారు అనేకులు తమయథాశక్తి చందాలు సమర్పించారు. శ్రీమతి కలగర రావమ్మ 10 కాసుల బంగారపు కడ్డీ మురుగును గాంధీజీకి సమర్పించారు. దానిని వేలం వేయగా రూ.220/- నిధికి చేర్చబడినాయి. చిలుకూరి నరసింహారావు సమర్పించిన చేతికర్రను మోతే గంగరాజు రూ.200/-కు కొన్నారు. ఒక నూలు కండువాను గ్రంధిరామమూర్తి రూ.25/–కు వేలం పాడారు. మహాత్ముని మెడలోని పుష్చ హారమును రూ.300/-కు కందుల రామయ్య, మరియొక హారమును ఒక బ్రాహ్మణుడు రూ. 45/- కు కొన్నారు. వాచీలు, గొలుసులు, ఉంగరములు మొదలగు ఆభరణములు ఎన్నో స్వరాజ్య నిధికై గాంధీజీకి సమర్పించారు. వేలం వేయుటకు వ్యవధి లేనందున మహాత్ముడు సభను ముగించారు. తరువాత మెయిల్లో మచిలీపట్నం వెళ్ళటకు బయలుదేరారు. * ఏలూరునందు తిలక్ స్వరాజ్యనిధి వస్తువుల విలువతో సహా రూ. 1021/- లు వసూలైనది. -