పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము



2. ప్రథమ సందర్శన 1921

గాంధీజీ ఏలూరు వస్తారని తెలియటంతో చుట్టు ప్రక్కల గ్రామములనుండి సుమారు 50 వేల మంది ప్రజలు వచ్చిచేరారు. పురమంతా మామిడి తోరణములతోను, కొబ్బరి ఆకుల పందెళ్ళతోను, అరటిచెట్లతోను అలంకరించబడింది. ఏలూరు నగరమంతా పండుగ వాతావరణాన్ని తలపింపచేసింది. 1921 ఏప్రియల్ 3వ తేదీ సాయంత్రము 4 గం||లకు రాజమండ్రి నుంచి వచ్చురైలులో సతీసమేతంగా గాంధీజీ, ఆయన అనుచరవర్గం ఏలూరు రైల్వేస్టేషను నందు దిగినారు. ఏలూరు రైల్వే స్టేషనునుండి ఇనుపవంతెన వరకు జనం క్రిక్కిరిసిపోయారు. ప్లాట్ ఫారముపై మోతే గంగరాజు, సోమంచి సీతారామయ్య, వలూరి రామారావు పంతులు, ఎర్రమిల్లి మంగయ్య వారణాశి రామమూర్తి, బడేటి వెంకట రామయ్య నాయుడు వేచియున్నారు. ఈ పెద్దలంతా గాంధీజీకి ఆహ్వానంపలికి పుష్పమాలాంకృతులను గావించారు. బ్యాండు, సన్నాయి, భజనలతో రెండు గుట్టాల బగ్లీపై ఏలూరు అంతా ఊరేగించారు. తరువాత టౌన్ హాలులో పదివేల మంది స్త్రీలు హాజరయిన సభలో గాంధీజీ ఉపన్యసించారు. తరువాత శ్రీమతి సత్తెరాజు వెంకట రత్తమ్మ గారి స్త్రీ సమాజ భవనమునకు గాంధీజీ శంకుస్థాపన గావించారు. స్త్రీ ప్రార్థనాసమాజం పక్షాన గాంధీజీ దంపతులకు సన్మానపత్రం సమర్పించబడింది. అచ్చట నుండి శనివారపుపేట రోడ్డుపై పయనించి సహాయనిరాకరణవాదులు నిర్మించిన "గాంధీ జాతీయ విద్యాలయమునకు ప్రారంభోత్సవం గావించి జాతీయ విద్యాలయాల ప్రాముఖ్యత వివరించారు. అచ్చట వరదారామస్వామి గారి పొలమునందు ఏర్పరచిన పారసభలో ప్రజలకోరికపై లోకమాన్య బాల గంగాధరతిలక్ చిత్రపటాన్ని ఆవిష్కరిసూ గాంధీజీఅద్భుత ఉపన్యాసాన్ని ఇచ్చారు. "నన్ను మీరు లోకమాన్యుని పటం ఆవిష్కరించమన్నారు. ఆమహానుభావుడు "స్వరాజ్యం తనజన్మహక్కు అనిభావించి తన సర్వస్వం ధారపోసి అందుకోసం యావజ్జీవం కృషిచేశారు. మరి మరణకాలంలో కూడా స్వరాజ్యమంత్రాన్నే జపించారు. అట్టి దేశబాంధవుని రూపము మీఎదుట ఉన్నది. స్వరాజ్యతత్వాన్ని చక్కగా గ్రహించే మీరు ఆమహానుభావుని చిత్రపటాన్ని ఆవిష్కరించమని కోరి ఉంటారు. గడచిన సంవత్సరమునుండి నేను, నా సోదరుడు మౌలానా షాకాత్ అలీ కలిసి దేశములో తిరుగుచున్నాము. కాని ఇప్పడు స్వరాజ్యసంపాదనకు కాలవ్యవధి సమీపించుచున్నందున మేము కలిసి పర్యటించేందుకు

21