పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆప్తవాక్యము

- మండెల సూర్యనారాయణ ఎమ్.కాం, ఎమ్.ఫిల్ ప్రిన్సిపాల్, శ్రీవల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆర్ట్స్ & సైన్స్ కళాశాల, అత్తిలి.

ఇరవయ్యో శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన వారిలో మహాత్మా గాంధీవలె ప్రజల దృష్టిని ఆకర్నించిన నాయకుడు మరొకరు లేరు. ఆయన వాక్కులు భారతీయులకు వేద మంత్రములయినవి. ఆయన చేపట్టిన కార్యక్రమములన్నీ ఘనత కెక్కాయి. ఆయన నిరాహారదీక్ష చేస్తే లక్షలాది ప్రజలు నిరాహారదీక్ష చేశారు. ఇరవైవ శతాబ్దంలో ప్రజలకోసం జీవితాన్ని త్యాగం చేసి తాదాత్మంచెందే అదృష్టం ఆయనకేదక్కింది. భారత స్వాతంత్ర్యసము పార్థనకు ఆయన అహింసా విధానంతో రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యవాదులను ఎదుర్కొన్నారు. స్వాతంత్ర యోధులకు ఈతత్వాన్ని బోధించి మార్గదర్శకుడైనారు. ఆయన కృషి రాజకీయరంగానికి మాత్రమే పరిమితంకాదు. అది సర్వతోముఖమై సాంఘిక, ఆర్థిక, ఆధ్యాత్మిక రంగాలకు వ్యాపించి ప్రజాజీవన విధానంలో విప్లవాత్మక మారును తెచ్చినది. అందుచే ఆయనను 'జాతిపిత"గా పరిగణిసూన్నాము.

అటువంటి మహామనిషి ఈ భూమిపై నడయాడినాడంటే భావితరాల వారు విస్మయాన్ని చెందుతారు. ఆయనకు సమకాలికులైన భారతప్రజల జన్మ చరితార్థమైనది. అట్టి అసాధారణమానవుడు స్వాతంత్ర్యోద్యమ కాలంలోపశ్చిమగోదావరి జిల్లాను మూడు పర్యాయములు సందర్శించారు. వారిరాక సందర్ణముగా జిల్లా ప్రజానీకం యావతూ తరతమ భేదాలను విస్మరించి