పుట:OkkaMaataKavitatvaalu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

డాక్టర్‌.

మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌.

హైదరాబాద్‌


http://www.facebook.com/vamshidhar.reddy.90410

secret window.vamc@gmail.com

Ph: 9985958810



రాయౌతున్న గుండెని, గొంతును
కసిగా ముద్దాడుకున్నపుడో,
వృత్తలేఖినితో గీసినట్లుండే కళ్ళు
ఇంతింత చేసుకుని..
రెండు జడల్నీ చేతులతో వెనక్కినెట్టుకుంటూ
చిన్నప్పటి స్నేహం ఊహల్లో పిలిచేటప్పుడో
..మనలోంచి తొంగిచూస్తాడు.

దేవతల అదృశ్య దుఃఖాన్ని తాకడం చేతగాక
మైకపురాత్రుల మోహపు కలల్లోకి జారుకునే
మామూలు మనుషులకు అరగని కవిత

నేలతవ్విన వెన్నెలల్లో కాళ్ళు కడుక్కుంటూ
మొండెంలేని కాలంచెప్పుల్లో చేరని
క్షితిజమ్మీద నుంచుని నవ్వుతున్నాడు

ప్రపంచం నిద్రించగానే
తనలోన ప్రపంచానికి ఫ్లాష్‌ బాక్‌,
మనకి హాలీవుడ్‌ సినిమా చూపిస్తాడు

ముఖం చీల్చుకుని బైటకొచ్చిన నిప్పుల నీడలా
గ్రహాల్ని గదిలోకి తెచ్చి గోడకుర్చీ వేయిస్తాడు
లోకానికి నిప్పు చురక.. స్నేహానికి చిరునామా