పుట:OkkaMaataKavitatvaalu.pdf/160

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు


ఉన్నతపాఠశాల గజిటెడ్‌

హెడ్మాష్టరుగా పదవీవిరమణ

సాంతఊరు: ఆలేరు, నల్గొండ

పుస్తకాలు: మట్టిపాత్తిళ్ళు, మూలకం, పాడాలని,

అచ్చయినవి: కవితలు, కథలు, వ్యాసాలు, పాటలు, నాటికలు

మైలురాళ్ళు: 1987 నుండి “రచనసాహితీకళావేదికి అనే సాహితీసంస్థను నడపడం


https:/www.facebook.com/haragopal.sriramoju

9949498698


ఆకాశం తలుపులు తీసి ఆమె పలకరించినప్పుడు...
అత్తిపత్తి ఆకుల్లా ముడుచుకున్న చీకట్లని
అత్తారుబత్తెంగా ఎత్తుకుని
పాత్తిళ్ళలో వేసి జోల పాడింది ఈ మాష్టారే..

ఆకుల్ని దూసేసిన
మొండికొమ్మ కథ తనదంటూ...
గుప్పిళ్ళ జ్ఞాపకాలను నింగిలోకి విసిరి..
కన్నీరై మురుస్తారు.

సంతోషం కోసం..
ఎన్ని దుఖ పరవశాలనువొదులుకోవాలో
తెలిసిన వారు కదా!

వాన పడితే పిల్లలు నవనవలాడుతూ
మొలుచుకొస్తారని
తొలకరి వాన కోసం ప్రాణసరం పట్టుకుని
హరగోపాల్‌ గారు ఎదను పాక్కిలి చేస్తున్నారు...

ఈ తొలకరి కవిత్వంలో మనం చిందేసి
మట్టికణంలా తడిసిపోదాం ..
బడిపిల్లల్లా మురిసిపోదాం