పుట:OkkaMaataKavitatvaalu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వృత్తి  : బిల్డర్‌ (నిర్మాణరంగం)

నివాసం : నిజాంపేట్‌, హైదరాబాద్‌

జన్మస్థలం : ఉనికిలి , కృష్ణ జిల్లా

ఫేస్బుక్ లో 'మణిమాలిక' గ్రూప్‌ నిర్వహిస్తున్నారు


http://www.facebook.com/prasad.atluri

http://www.telugulokavithalu.com/

సెల్ నెం : 500087000

ఊహలు...
మనసును మోసే గుర్రాలయితే
వాస్తవాలు...
ఎగిరెగిరి తన్నే గాడిదలన్న మాట
ఓ బాణమై గుచ్చుకుంది.
ఏ సాహిత్యపు మొలకైనా సామాజిక
రుగ్మతల్ని నయంచేయగలిగే బెషథ గుళికైతే
ఎంతబావుణ్ణు...అనుకుని కవిత్వం వెలువరిస్తున్నారు.
విధికాలం మీదపడేసిన
వృద్ధాప్యాన్ని కప్పుకొన్న అవ్వపైనా...
సినీ ఆకాశం నుండి వినీల ఆకాశంలోకి
రాలి ఎగిసిన తార పైనా,
కనుమరుగైన పిచ్చుక పైనా... ఒకే జాలి..వీరికి..

తోడైనందుకు...ప్రతి అడుగుకీ నీడైనందుకు
అక్షరంతో కాలగమనాన్ని నిలువరించే ప్రయత్నం
ఏం సాధించావనేదానికి పోయేలోపు మనం
తెలుసుకున్న పదాల అర్థాల సారమే కొలమానం
అంటున్నారు ... ప్రసాద్‌ అట్లూరి.
గుండె గదిలో భద్రంగా ఉన్న గతం పునాదులపైనే
నిలబడ్డారు... హృదయం ధనస్సును వంచి
భావాల బాణాలు ఎక్కుపెడుతున్నారు