పుట:Oka-Yogi-Atmakatha.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

ఒక యోగి ఆత్మకథ

జీవితం మన ముందుంచే మంచి చెడ్డలు, ప్రతి ఒక్కడి తెలివినీ పరీక్షించే స్ఫింక్స్[1] చేసే మాదిరి జటిలమైన యక్ష ప్రశ్న. మానవులు చాలామంది, దాని పరిష్కారానికి ప్రయత్నించకుండానే జీవితాలను కోల్పోతారు; థీబ్స్ రోజుల్లో మాదిరిగా ఇప్పటికీ అదే దండన. కాని అక్కడక్కడ, ఓటమి నంగీకరించని మహోన్నత శిఖరంలా ఒక్కొక్కడు ఒంటరిగా నిలుస్తాడు. ద్వైతంలో ఉన్న మాయ[2]లో నుంచి అఖండమైన అద్వైత సత్యాన్ని చేజిక్కించుకొంటాడు.”

“మీరు దృఢ విశ్వాసంతో చెబుతున్నారండి.”

“నేను చాలాకాలం, చిత్తశుద్ధిగా అంతఃపరిశీలన అభ్యసించాను; జ్ఞానార్జనకు అత్యంత బాధాకరమైన మార్గమిది. ఆత్మపరీక్ష చేసుకోడం,

  1. గ్రీకు పురాణ కథలో వచ్చే రాక్షసి. దీని తల స్త్రీది; శరీరం సింహానిది కాని, కుక్కది కాని; రెక్క లుంటాయి. ఈ రాక్షసి, థీబ్స్ అనే ప్రాచీన గ్రీకు నగరంలో, వచ్చేపోయేవారిని యక్షప్రశ్నలు వేసి, జవాబు చెప్పలేని వాళ్ళను తినేసేదని ప్రసిద్ధి.
  2. విశ్వభ్రాంతి; దీనికి వాచ్యార్థం “కొలిచేది” అని. మాయ అనేది సృష్టిలోని ఇంద్రజాల శక్తి; దీనివల్ల అమేయం, అఖండం అయిన పరమాత్మలో పరిమితులూ, విభాగాలూ కనిపిస్తూ ఉంటాయి.

    ‘మాయ’ను గురించి ఎమర్సన్ ఈ కింది పద్యం రాశాడు (దాన్ని అతడు Mala అన్న వర్ణక్రమంలో రాశాడు)

    అభేద్యమైన దాన్ని కల్పిస్తుంది మాయ,
    లెక్కలేనన్ని సాలెగూళ్ళు ఆల్లుతూ;
    ఉల్లాసకరమైన దాని చిత్రరూపాలు విఫలంకా వెన్నడూ,
    ఒకదాని మీ దొకటి పడుతుంటాయి, తెరమీద తెరలా:
    మోసపోవడానికి తపించేవాణ్ణి
    తప్పకుండా నమ్మిస్తుంది ఈ మోహకారిణి.