పుట:Oka-Yogi-Atmakatha.pdf/885

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1940 - 1951 మధ్యకాలం

849

తంటే, సృష్టి అన్నది ఆయన లీల, సృజనశీల క్రీడ).[1] నియమబద్ధమైన అణుప్రవాహంలో వ్యక్తమయిన ఆయన బాహ్యప్రకృతి, ఆయన్ని బయల్పరచకుండా కేవలం వ్యక్తీకరించడం మట్టుకే చేస్తుంది కనక, త్రిమూర్తుల రహస్యాలనన్నిటినీ గ్రహించినప్పటికీ కూడా, ఆయన అంతర్నిగూఢ మూలస్వరూపాన్ని అవగాహన చేసుకోడం సాధ్యం కాదు. “కొడుకు తండ్రి దగ్గరికి చేరినప్పుడే”[2] ఈశ్వరుడి చరమ ప్రకృతి తెలుస్తుంది. విముక్త మానవుడు స్పందనశీల లోకాల్ని అధిగమించి స్పందన రహిత మూలతత్త్వంలోకి ప్రవేశిస్తాడు.

పరమ రహస్యాల్ని వెల్లడిచెయ్యమని కోరినప్పుడు గొప్ప ప్రవక్తలందరూ మౌనం వహించారు. “సత్యమంటే ఏమిటి?” అని పిలేట్ అడిగినప్పుడు, క్రీస్తు జవాబు చెప్పలేదు. పిలేట్ లాంటి బుద్ధివాదులు ఆడంబరంగా వేసే పెద్దపెద్ద ప్రశ్నలు, తీవ్రమైన జిజ్ఞాసతో వేసినవి కావడం అరుదు. అలాటి వ్యక్తులు సాధారణంగా, ఆధ్యాత్మికమైన విలువల[3] గురించి దృఢవిశ్వాసం లేకపోవడమన్నది. “నిష్కపట మనస్తత్త్వానికి” గుర్తుగా పనికిమాలిన పొగరుబోతుతనంతో మాట్లాడుతూ ఉంటారు.

“సత్యానికి సాక్షిని కావాలన్న ధ్యేయంతోనే నేను పుట్టాను; ఈ

  1. “ఓ ప్రభూ... అన్నిటినీ నువ్వు సృష్టించావు; అవన్నీ నీ ఆనందంకోసం సృష్టి అవుతున్నాయి.” - రివలేషన్ 4 : 11 (బైబిలు).
  2. యోహాను 14: 12.
  3. “మంచిని ప్రేమించు; అదొక్కటే స్వేచ్ఛగా ఉన్నది;
     అదే నేర్పగలదు నీకు, ఎలా పైకి పోవాలో
     తరంగిత ఘంటానాదం కన్న, పైకి;
     ఆ మంచె నీరసమై ఉంటే.
     స్వర్గమే దానికోసం కిందికి వంగుతుంది. - మిల్టన్, ‘కేమస్’