పుట:Oka-Yogi-Atmakatha.pdf/881

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1940 - 1951 మధ్యకాలం

845

జన్మ తరవాత జన్మ చొప్పున ప్రతి మనిషి తన దైవత్వ లక్ష్యం వేపు సాగుతూనే ఉంటాడు. (ఆతని నడక ఎంత అడ్డాదిడ్డిగా ఉన్నా అతని పద్ధతిలో అతను నడుస్తాడు). మానవుడి పురోగతిలో ఆటంకం కానటువంటి మృత్యువు, అతడు తన మాలిన్యాన్ని క్షాళనం చేసుకోడానికి వీలయిన సూక్ష్మలోకపు అనుకూలతరమైన పరిసరాన్ని అతనికి సమకూరుస్తుంది. “మీ గుండెలో గాభరా కలగనివ్వకండి... నా తండ్రి ఇంట్లో చాలా భవనాలున్నాయి.”[1] ఈ లోకాన్నికాని పరలోకాన్నికాని, వ్యవస్థీకరించడంలో భగవంతుడు తన ప్రతిభను వ్యయం చేసేసుకోడానికి అవకాశం లేదు; వీణలు మీటడానికి మించి, మనలో ఆసక్తి పెరగడానికి ఆయన మరేమీ ప్రస్తావించడు.

మరణం అనేది మనుగడను మట్టుపెట్టేదీ జీవితం నుంచి చరమ పలాయనమూ కాదు; అమరత్వానికి ద్వారమూ కాదు. ప్రాపంచిక సుఖాల్లో మునిగి తన ఆత్మనుంచి పలాయనమైనవాడు, సూక్ష్మలోకపు సూక్ష్మాకర్షణల మధ్య దాన్ని తిరిగి వశం చేసుకోలేడు. అక్కడతడు కేవలం సూక్ష్మతర అనుభూతులనూ, మౌలికంగా ఏకైకమయిన సుందర శివాల ఇతోధిక సంవేదనశీలమైన అనుభవాల్నీ కూడబెట్టుకుంటాడు. సంఘర్షించే ఆ మానవుడు, ఈ స్థూలప్రపంచమనే దాగర మీదే, ఆధ్యాత్మిక అభిన్నత అనే అక్షయ సువర్ణాన్ని సుత్తితో సాగగొట్టాలి. దురాశా పూరితమైన మృత్యువుకు స్వీకారయోగ్యమూ ఏకైక బహూకృతీ అయిన- కష్టపడి సంపాదించిన బంగారు నిధిని చేతబెట్టుకొని మానవుడు, భౌతిక పునర్జన్మల ఆవృత్తులనుంచి చరమ విముక్తి సాధిస్తాడు.

చాలాకాలంపాటు నేను పతంజలి యోగసూత్రాలనూ, హిందూదర్శన శాస్త్రానికి సంబంధించిన గూడార్థమయమైన ఇతర గ్రంథాలనూ

  1. యోహాను 14 : 1-2 (బైబిలు).