పుట:Oka-Yogi-Atmakatha.pdf/876

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

840

ఒక యోగి ఆత్మకథ

సమాధి)[1] స్థితిలో ఉండగా, నిజంగా గమనించడం జరిగింది. ఆ స్థితి రానిదే ఏ ఒక్కడూ, దైవసాక్షాత్కార సాధనలో ప్రథమ దశలలోకి ప్రవేశించలేడు. (అయితే సాధువు, అత్యున్నతమైన ‘నిర్వికల్ప సమాధి’కి చేరిన తరవాత మాత్రం, అతడిక తిరుగులేకుండా ఈశ్వరుడిలో ప్రతిష్ఠితుడై ఉంటాడు. అతడు ఊపిరి తీసుకోకపోయినా, తీసుకుంటున్నా, నిశ్చలంగా ఉన్నా, పనిచేస్తున్నా సరే).

బ్రదర్ లారెన్స్ అనే 17 శతాబ్ది క్రైస్తవ మార్మికుడు, ఒక చెట్టును చూస్తూండడంవల్ల తనకు, దైవసాక్షాత్కారంలో తొలి అనుభూతి కలిగిందని చెప్పాడు. దాదాపు మనుషులందరూ చెట్టును చూసినవాళ్ళే; కాని కొద్దిమందే, చెట్టుద్వారా, చెట్టును సృష్టించినవాణ్ణి దర్శించారు. చాలామంది, నిర్ని రోధమైన భక్తిశక్తుల్ని ఆవాహన చెయ్యడంలో బొత్తిగా పనికిరానివాళ్ళు; కాని ప్రాచ్యదేశాల్లోనయితే నేమి, పాశ్చాత్యదేశాల్లో నయితే నేమి, అన్ని మతమార్గాల్లోనూ కనిపించే కొద్దిమంది ‘ఏకాంతు’లకు – అంటే, ఏకైక హృదయాభిలాషగల సాధువులకు మాత్రమే ఆ శక్తి అప్రయత్నంగా అలవడింది. అయినప్పటికీ సామాన్య మానవుడికి[2]

  1. 26 అధ్యాయం చూడండి. సవికల్ప సమాధిలో ఉండగా కనిపించిన క్రైస్తవ మార్మికుల్లో చెప్పుకోదగినావిడ, ఆవిలా వాస్తవ్యురాలైన సెంట్ తెరిసా. ఆవిడ శరీరం, కదపడానికి వీలులేకుండా ఎంత స్థిరంగా బిగిసిపోయేదంటే, వాళ్ళ మఠంలో, ఆవిణ్ణి చూసి ఆశ్చర్యపోయిన సన్యాసినులు, ఆవిడ భంగిమను మార్చడానికి కాని, బాహ్యస్పృహ కలిగించడానికి కాని అశక్తులయేవారు.
  2. “సామాన్య మానవుడు”. ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు ఆధ్యాత్మిక కృషి ఆరంభించవలసిందే. “వెయ్యిమైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది,” అన్నాడు లావో-ట్జు. “మంచిని గురించి, ‘అది నా దగ్గరికి రాదు’ అని మనస్సులో ఎవరినీ అనుకోనియ్యకు. ఒక్కొక్క నీటిబొట్టుతోనే కుండ నిండుతుంది; బుద్ధిమంతుడు కొద్దికొద్దిగా ప్రోది చేసుకుంటున్నప్పటికీ చివరికి మంచితో నిండిపోతాడు,” అంటూ బుద్ధుడు చెప్పింది పోల్చి చూడండి.