పుట:Oka-Yogi-Atmakatha.pdf/875

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1940 - 1951 మధ్యకాలం

839

భారతదేశపు పవిత్ర గ్రంథాల్లోకల్లా సర్వోత్కృష్టమైన ఈ మహా గ్రంథం, ఒక యోగప్రక్రియను (భగవద్గీతలో చెప్పిన ఒకే ఒకటి; దాన్నే బాబాజీ సులువుగా ‘క్రియాయోగం’ అన్నారు), కంఠోక్తిగా రెండు[1]సార్లు ప్రస్తావిస్తూ, ఆచరణ సాధ్యమూ నీతిపరమూ అయిన ఉద్బోధను ప్రసాదించింది. మన స్వప్నలోక మహాసాగరంలో ఊపిరి అనేది, మానవరూపాలూ తదితర భౌతిక వస్తురూపాలూ అనే వైయక్తిక తరంగాల చైతన్యాన్ని ఉత్పాదించే ఒక విశిష్ట మాయామేయ ఝంఝు. మానవుణ్ణి, తన ప్రత్యేక అస్తిత్వమనే బాధాకరమైన స్వప్నంలోంచి మేల్కొలపాలంటే కేవలం తాత్త్విక, నైతిక జ్ఞానం ఒక్కటి చాలదని తెలుసుకొని, కృష్ణభగవానుడు, యోగి తన శరీరాన్ని స్వాధీనంచేసుకొని ఇచ్ఛానుసారంగా, శుద్ధశక్తిగా మార్చడానికి వీలయిన పవిత్రశాస్త్రాన్ని ఉపదేశించాడు. ఈ అద్భుత యోగశక్తి సామర్థ్య నిరూపణావకాశం, అణుయుగానికి మార్గదర్శులైన ఆధునికశాస్త్రవేత్తల సైద్ధాంతికావగాహనకు అతీతమైనదేమీ కాదు. అన్ని రకాల పదార్థమూ శక్తిగా మార్చడానికి వీలయినదని రుజువయింది.

మానవజాతి సర్వసాధారణంగా ఆశించదగింది కాబట్టి, హిందూ పవిత్ర గ్రంథాలు, యోగశాస్త్రాన్ని కీర్తించాయి. దైవభక్తిలో అతీంద్రియ శక్తులు పొందిన, హిందువులుకాని మార్మికయోగుల విషయంలో మాదిరిగా, ఔపచారిక (formal) యోగపద్ధతులేవీ ఉపయోగించకపోయినప్పటికీ శ్వాసరహస్యం అప్పుడప్పుడు వెల్లడి అవుతూ వచ్చింది; ఇది నిజం. క్రైస్తవ, ముస్లిం మతాలవంటి ఇతర మతాల అనుయాయులైన సాధువులు కొందరు ఊపిరిలేకుండా, కదలికలేకుండా సమాధి (సవికల్ప

  1. భగవద్గీత 4:29; 5:27-28.