పుట:Oka-Yogi-Atmakatha.pdf/867

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1940 - 1951 మధ్యకాలం

831

ఒత్తిపలుకుతూ, నే నింకా ఇలా చెప్పాను: “కాని నా జవాబు, ఔననే; వెయ్యిసార్లు చెబుతాను ఔనని! ఆధ్యాత్మిక బంధమనే ఏకైక శాశ్వత బంధంలో సన్నిహితమై ఉన్న, ప్రాచ్య పాశ్చాత్యఖండాల్ని రెండింటినీ చూడాలని నేను కన్న కలలకన్న కూడా మిన్నగా, నా కృషి ఫలిస్తూ వచ్చింది.”

పాశ్చాత్యదేశాల విషయంలో గాఢమైన ఆసక్తి చూపించిన భారతీయ మహాగురువులు ఆధునిక పరిస్థితుల్ని బాగా అర్థంచేసుకున్నారు. దేశాలన్నిటిలోనూ ప్రాచ్య, పాశ్చాత్యాల విశిష్ట సద్గుణాల సమన్వయం ఇంకా బాగా జరగనిదే, ప్రపంచం మెరుగుపడదని వారికి తెలుసు. ప్రతి భూగోళార్ధానికీ రెండోదాంట్లోని సర్వోత్కృష్ట సంతానం చాలా అవసరం.

ప్రపంచయాత్ర చేసినప్పుడు నేను, ప్రజల బాధల్ని గమనిస్తూ ఎంతో దిగులుపడ్డాను. ప్రాచ్యదేశాల్లో బాధ అన్నది ముఖ్యంగా, భౌతికతలంలోది; పాశ్చాత్యదేశాల్లో అది ముఖ్యంగా ఆధ్యాత్మిక తలంలోది. అసంతులిత నాగరికతల బాధాకరమైన ఫలితాల్ని దేశాలన్నీ అనుభవిస్తున్నాయి.[1] భారతదేశమూ తక్కిన తూర్పుదేశాలూ అమెరికావంటి పడమటి

  1. ఆ స్వరం సముద్రఘోషలా నన్ను చుట్టుముట్టింది:

    “విధ్వంసమై నీ భూమి
      శకలాలుగా చెదిరపోయిందా?

    అవిగో, అన్నీ నీకు దూరంగా పారిపోతున్నాయి. నువ్వు నాకు దూరంగా పోతున్నావు కనక:

    నీ దగ్గర్నించి తీసుకున్నవన్నీ నేను
                నీకు హాని కలిగించాలని కాదు,
    వాటిని నువ్వు నా చేతులమీదగా పొందజూడాలని,
                పసివాడిలా పొరబడి నువ్వు

    ఏవి పోయాయని తలుస్తున్నావో, వాటినన్నిటినీ భద్రపరిచాను ఇంట్లో.

    లే, నా చెయ్యి బిగబట్టుకో, రా ఇక!”

    -ఫ్రాన్సిన్ థాంప్సన్, ‘ది హౌండ్ ఆఫ్ హెవెన్’లో