పుట:Oka-Yogi-Atmakatha.pdf/865

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1940 - 1951 మధ్యకాలం

829

వివిధ ఎస్. ఆర్. ఎఫ్. కేంద్రాలకు కొత్తగావచ్చే వాళ్ళు తరచుగా, యోగవిద్యగురించి తదుపరి పరిజ్ఞానం కలిగించమని కోరుతూంటారు. ఒక్కొక్కప్పుడు నాకు ఈ ప్రశ్న వినవస్తూ ఉంటుంది: ‘కొన్ని సంస్థలు నొక్కి వక్కాణిస్తున్నట్టుగా, యోగవిద్య, దగ్గరలో ఉన్న గురువు మార్గదర్శకత్వంలో సాధన చెయ్యవలసిందే తప్ప, అచ్చులో వచ్చింది చదువుకొని సరిగా అధ్యయనం చేసి ఫలితాలు సాధించడానికి వీలు కాదన్నది నిజమేనా?” అని.

అణుయుగంలో, యోగవిద్యను, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ పాఠాల మాదిరి బోధనపద్ధతిలో నేర్పవలసిందే, లేకపోతే విముక్తిదాయకమైన ఆ శాస్త్రం మళ్ళీ, ఎంపికచేసిన కొద్దిమందికే పరిమితమయిపోతుంది. ప్రతి విద్యార్థీ దివ్యజ్ఞానంతో పరిపూర్ణతాసిద్ధి పొందిన ఒక గురువును దగ్గర పెట్టుకుని ఉంటే, నిజంగా అది అమూల్యమైన వరమే; కాని ప్రపంచంలో “పాపులు” చాలామంది, సాధువులు కొద్దిమంది. అటువంటప్పుడు మరి, నిజమైన యోగులు రాసిన బోధనలను తమ ఇళ్ళలో చదువు కోకపోయినట్లయితే, జనబాహుళ్యానికి యోగవిద్య ఎలా సాయపడుతుంది?”

దానికి ప్రత్యామ్నాయమేమిటంటే, “సగటు మనిషి”ని ఉపేక్షించి, అతనికి యోగశాస్త్ర పరిజ్ఞానం కలిగించకుండా వదిలెయ్యడం. నవశకానికి నిర్ణీతమైన దైవప్రణాళిక ఆ మాదిరిది కాదు. చిత్తశుద్ధిగల క్రియాయోగు లందరినీ తమ లక్ష్యసాధనకు చేసే కృషిలో పరిరక్షిస్తూ మార్గదర్శిత్వం వహిస్తూ ఉంటానని బాబాజీ మాట ఇచ్చారు.[1] మానవులు, పరమేశ్వరుని

  1. పరమహంస యోగానందగారు కూడా. ఈ జీవితం ముగిసిన తరవాత ‘క్రియావంతులు’ (సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్/యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా పాఠాలు చదివి క్రియాయోగ దీక్ష తీసుకున్న విద్యార్థులు) అందరి ఆధ్యాత్మిక ప్రగతిని పైనుంచి గమనిస్తూనే ఉంటామని ప్రాచ్య పాశ్చాత్యదేశాల్లోని తమ శిష్యులకు చెప్పారు. ఈ చక్కని వాగ్దానంలోని సత్యం, ఆయన మహాసమాధి జరిగిన నాటినించి ఈనాటి వరకు, ఆయన సర్వాంతర్యామి మార్గదర్శిత్వం తెలిసి వచ్చిన క్రియాయోగులు అనేక మంది రాసిన ఉత్తరాల్లో రుజువయింది. (ప్రచురణకర్త గమనిక).