పుట:Oka-Yogi-Atmakatha.pdf/864

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

828

ఒక యోగి ఆత్మకథ

ఒక ప్రార్థనాలయం ఉంది; ఒక దిగుదల తోట దగ్గర, పెద్ద నీటిచక్రం ఒకటి నిదానంగా తిరుగుతూ గానంచేస్తూ ఉంటుంది. చైనానుంచి వచ్చిన రెండు పాలరాతి విగ్రహాలు- ఒకటి బుద్ధుడిది, రెండోది క్వాన్ యిన్‌దిన్ (క్వాన్‌యిన్ , జగన్మాతకు చైనావారు కల్పించిన మూర్తి)- ఆ స్థానాన్ని అలంకరించాయి. సౌమ్యమైన ముఖమండలంతో, జీరాడుతున్న బట్టలతో ఉన్న నిలువెత్తు క్రీస్తు విగ్రహం ఒకటి, ఒక జలపాతానికి పైనున్న కొండమీద ఉంటుంది; రాత్రిపూట దానికి బ్రహ్మాండంగా దీపాలంకరణ చేస్తారు. మందిరంలో కృష్ణభగవానుడిదీ ఇతర ప్రవక్తలవీ విగ్రహాలు ఉన్నాయి.

సరోవరాలయం దగ్గర, గాంధీమహాత్ముల ప్రపంచశాంతి స్మారక చిహ్నం (మహాత్మాగాంధీ వరల్డ్ పీస్ మెమోరియల్) ఒకటి 1950 లో, అమెరికాలో ఎస్. ఆర్. ఎఫ్. ముప్ఫయ్యో వార్షికోత్సవ[1] సందర్భంగా ఏర్పాటయింది. భారతదేశం నుంచి పంపిన, గాంధీమహాత్ముల చితాభస్మంలో కొంతభాగం, వెయ్యేళ్ళనాటి ఒక రాతిపెట్టె (sarcophagus) లో భద్రపరచడం జరిగింది.

1951 లో హాలీవుడ్‌లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రం ఒకటి ఏర్పాటయింది. కాలిఫోర్నియా లెఫ్టినెంట్ గవర్నర్, శ్రీ గుడ్విన్ జె. నైట్, కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా, శ్రీ ఎం. ఆర్. ఆహూజా, నాతోబాటు ప్రారంభోత్సవ ప్రార్థన సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ కేంద్రం స్థానంలోనే ‘ఇండియా హాలు’ ఉంది; ఇది 250 మంది కూర్చోడానికి వీలయిన సమావేశ సదనం.

  1. ఈ వార్షికోత్సవం జరిగేటప్పుడు నేను, 1950 ఆగస్టు 27 న లాస్ ఏంజిలస్‌లో పవిత్రమైన గులాబి - దీపోత్సవం ఒకటి నిర్వహించాను; అప్పుడే 500 మంది విద్యార్థులకు క్రియాయోగ దీక్ష ఇచ్చాను.