పుట:Oka-Yogi-Atmakatha.pdf/860

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

824

ఒక యోగి ఆత్మకథ

మర్నాడు రాత్రి, “ఓ గాడ్ బ్యూటిఫుల్” అన్న పాటలోని భక్తిపూరితమైన స్వరాలు ఒకేసారి మూడువేల కంఠాల్లోంచి వెలువడి, గంట సేపటికి పైగా వినవచ్చాయి. ప్రియమైన న్యూయార్కు వాసులారా, అసంతృప్తి చెందకండి! మీ హృదయాలు సరళమైన ఈ కీర్తనలో ఆనందతరంగితాలయాయి. భగవంతుడి దివ్యనామాన్ని ప్రేమతో గానం చేసిన భక్తులకు ఆ రాత్రి, దివ్యమహిమవల్ల జబ్బులు నయమయాయి.

1939 లో, బోస్టన్‌లో ఉన్న సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాన్ని చూడడానికి వెళ్ళాను. బోస్టన్ కేంద్రం నాయకుడైన డా॥ ఎం. డబ్ల్యు. లూయిస్ నాకు, కళాత్మకంగా అలంకరించిన ఒక మందిరంలో బస ఏర్పాటుచేశాడు. డా॥ లూయిస్ చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు: “గురూజీ, మీరు అమెరికాలో ఉన్న తొలిరోజుల్లో ఈ నగరంలో, స్నానాల గది లేని ఒంటిగదిలో ఉన్నారు. అయితే, బోస్టన్ నగరంలో విలాసవంతమైన నివాసాలు కూడా కొన్ని ఉన్నాయన్న సంగతి మీకు తెలియాలని అనుకున్నాను!

కాలిఫోర్నియాలో అనేక సంవత్సరాలు వివిధ కార్యకలాపాలతో కులాసాగా గడిచిపోయాయి. ఎన్సినిటాస్‌లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కోలనీ[1] ఒకటి 1937 లో ఏర్పడింది. కోలనీలో జరిగే అనేక కార్యకలాపాలు, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఆశయాల్ని అనుసరించి

  1. ఇప్పుడిది బాగా వర్ధిల్లుతున్న ఆశ్రమ కేంద్రం; ఇక్కడి భవనాల్లో అసలు ప్రధాన ఆశ్రమమూ, సన్యాసులకూ సన్యాసినులకూ వేరువేరు ఆశ్రమాలూ భోజన సదుపాయాలూ, సభ్యులకూ స్నేహితులకూ ఆకర్షవంతమైన ఏకాంత స్థలమూ ఉన్నాయి. రాజమార్గంవేపు ఉన్న విశాల భూమికి అభిముఖంగా వరసగా తెల్లటి స్తంభాలున్నాయి. వీటికి మకుటాయమానంగా, స్వర్ణదళాల లోహ పద్మాలున్నాయి. భారతీయ కళలో పద్మం, “మెదడులోని వెయ్యిరేకుల వెలుగుల తామరపువ్వు” అనే విశ్వచేతనాకేంద్రానికి (అంటే సహస్రారానికి) చిహ్నం.