పుట:Oka-Yogi-Atmakatha.pdf/859

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాలిఫోర్నియాలో ఎన్సినిటాస్‌లో

823

న్యాసం; కాలం, ఏప్రిల్ 18, 1926; స్థలం, న్యూయార్కులో కార్నెగీ హాలు.

“ఓ గాడ్ బ్యూటిఫుల్” (హే హరిసుందర!) అన్న పూర్వకాలపు కీర్తన ఒకటి పాడమని శ్రోతల్ని అడుగుదామనుకుంటున్నాను,” అని ఏప్రిల్ 17న, శ్రీ ఆల్విన్ హన్సికర్ అనే అమెరికన్ విద్యార్థికి చెప్పాను.[1]

ప్రాచ్యదేశాల పాటలు అమెరికన్లకు సులువుగా అర్థంకావని, నేనన్నదానికి అభ్యంతరం చెప్పాడు శ్రీ హన్సికర్.

“సంగీతం సర్వప్రపంచ భాష,” అని జవాబిచ్చాను. “ఆ ఉదాత్త కీర్తనలో ఉన్న ఆత్మోత్తేజక భావాన్ని అనుభూతి కావించుకోడంలో అమెరికావాళ్ళు విఫలం చెందరు.”


  1. గురునానక్ పాటలోని పదాలు ఇలా ఉంటాయి:

    హే హరిసుందర, హే హరిసుందర

    వనోం వనోం మే శ్యామల శ్యామల
    గిరీ గిరీ మే ఉన్నత ఉన్నత
    సరితా సరితా చంచల చంచల
    సాగర సాగర గంభీర హే!

    సేవక జన కే సేవ సేవ పర్
    ప్రేమికజన కే ప్రేమ ప్రేమ పర్
    దుఃఖిజనోంకే వేదన వేదన
    యోగిజనోంకే ఆనంద హే!

    హే హరిసుందర హే హరిసుందర
    తేరే చరణ్‌పర్ సిర్ నమో!