పుట:Oka-Yogi-Atmakatha.pdf/847

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పడమటికి నా తిరుగుప్రయాణం

811

విండ్‌సార్ హౌస్ ఆడిటోరియంలో తొమ్మిదిన్నర గంటలకు జరిగే నా రెండో ఉపన్యాసం కోసం రెండు రాత్రిళ్ళు కాసుకుని ఉన్నారు. ఆ తరవాత జరిగిన యోగవిద్యా తరగతుల్ని శ్రీరైట్, మరో హాలుకు మార్చవలసినంత పెద్దగా పెరిగింది సంఖ్య.

ఇంగ్లీషువాళ్ళ పట్టుదల ఆధ్యాత్మిక బంధుత్వంలో ప్రశంసనీయంగా వ్యక్తమయింది. నేను ఆ దేశాన్ని విడిచి వచ్చిన తరవాత, లండన్ యోగ విద్యార్థులు నిష్ఠగా సెల్ఫ్ రియలై జేషన్ ఫెలోషిప్ కేంద్రాన్ని ఏర్పరచుకొని, ఘోరయుద్ధం జరుగుతున్న సంవత్సరాల్లో కూడా నియమ ప్రకారంగా వారానికోసారి ధ్యాన సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు.

ఇంగ్లండులో మరుపురాని రోజులు; కొన్నాళ్ళు లండన్‌లో నగర విహారం, తరవాత సుందరమైన పల్లెప్రాంతాల సందర్శన. బ్రిటిష్ చరిత్రలో నిలిచిపోయిన మహాకవులవీ వీరులవీ జన్మస్థలాలూ సమాధులూ చూడ్డానికి నేనూ, శ్రీరైట్ నమ్మకంగా పనిచేసే ఫోర్డుకారునే ఉపయోగించాం.

మా చిన్న బృందం అక్టోబరు చివరిలో, “బ్రేమన్” ఓడలో సౌదాంప్టన్ నుంచి అమెరికాకు బయలుదేరింది. న్యూయార్కు రేవులో ఉన్న గంభీరమైన శ్టాచూ ఆఫ్ లిబర్టీ కంటబడేసరికి మా గుండెలు ఆనందంతో ఎగిసిపడ్డాయి.

మా ఫోర్డుకారు, సనాతన భూముల్లో పడ్డ అవస్థలవల్ల ఒక రవ్వ దెబ్బతిన్నప్పటికీ దృఢంగానే ఉంది; ఇప్పుడది కాలిఫోర్నియాకు ఖండాంతరయానం చేస్తూ చురుకుగా ముందుకు సాగింది. 1936 ముగుస్తుందనగా, మౌంట్ వాషింగ్టన్ కేంద్రానికి చేరాం.