పుట:Oka-Yogi-Atmakatha.pdf/844

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

808

ఒక యోగి ఆత్మకథ

ఆ సాధ్వి గాఢమైన ధ్యానస్థితిలోకి వెళ్ళారు. ఆవిడ దృష్టి అంతర్ముఖమయింది; ఆవిడ కళ్ళలోతులు అభావసూచకాలయాయి. శ్వాసలేని ఆనందసమాధి స్థితికి నాందిగా, ఆవిడ ఒక రకమైన నిట్టూర్పు విడిచారు. కొంత సేపు ఆవిడ ఆంతరిక ఆనంద స్వర్గంలోని నిరాక్షేపణీయమైన రాజ్యానికి పరుగుతీశారు.

చీకటి ముసిరింది. ఒక చిన్న కిరసనాయిలు దీపం వెలుగు, నిశ్శబ్దంగా నీడల్లో కూర్చున్న అనేకమంది గ్రామీణుల ముఖాల మీద