పుట:Oka-Yogi-Atmakatha.pdf/842

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

806

ఒక యోగి ఆత్మకథ

ఇతరులెవరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికని, మా చుట్టూ కాపుదలగా ఒక కాంతి పరివేషాన్ని కల్పించారు. మర్త్యులమాదిరిగా స్థూలమైన ఆహారాలమీద ఆధారపడకుండా, శరీరానికి స్వేచ్ఛ ప్రసాదించే ‘క్రియా’ ప్రక్రియను నాకు ఉపదేశించారు. ఆ ప్రక్రియలో ఒకానొక మంత్రమూ,[1] సగటు మనిషి సాధనచేసే దానికన్న కష్టతరమైన ఒక శ్వాసనియంత్రణాభ్యాసం ఉంటాయి. మరే మందూ గారడీ ఇందులో లేవు. ‘క్రియ’కు మించి మరేం లేదు.”

నాకు అనుకోకుండా, పత్రికారచనా విధానం అలవరిచిన అమెరికా పత్రికారచయిత ధోరణిలో, గిరిబాలగారిని అనేక విషయాలగురించి ప్రశ్నించాను; అవి పాశ్చాత్యులకు ఆసక్తి కలిగిస్తాయని నా అభిప్రాయం.

ఆవిడ కొద్దికొద్దిగా ఇలా చెబుతూ వచ్చారు: “నా కెన్నడూ పిల్లలు కలగలేదు; చాలా ఏళ్ళ కిందట నేను వితంతువునయాను. నాకు నిద్ర, మెలకువ రెండూ సమానమే కనక, చాలా తక్కువసేపు నిద్రపోతూంటాను. పగటిపూట, నా ఇంటిపనులన్నీ చేసుకొని రాత్రిపూట ధ్యానం చేస్తాను. ఋతువు తరవాత ఋతువు మారుతూ వస్తున్నప్పుడు, వాటి మార్పు నాకు కొద్దిగానే అనుభూతమవుతుంది. నే నెప్పుడూ జబ్బు పడలేదు; ఏ వ్యాధి నా అనుభవంలో లేదు. ప్రమాదవశాత్తు గాయపడ్డప్పుడు కొద్దిగా నొప్పి కలుగుతుంది. నాకు శారీరకమైన మలమూత్రాది

  1. శక్తియుతమైన స్పందనశీలక మంత్రం. సంస్కృతంలో మంత్ర శబ్దానికి, “మనన సాధనం” అన్నది అనువాదం. అది, “సృష్టిలో ఒక వైఖరికి ప్రాతినిధ్యం వహించే ఆదర్శవంతమైన అశ్రావ్య ధ్వనుల సముదాయం.” ఆ మంత్రాన్ని అక్షరరూపంలో ఉచ్చరించినప్పుడు, అది విశ్వపరిభాష అవుతుంది. (వెబ్‌స్టర్స్ న్యూ ఇంటర్నేషనల్ డిక్‌ష్ణరీ). ధ్వనికి ఉండే అన్ని శక్తులూ ఓంకారం నుంచి వచ్చినవి; అదే “శబ్దం”, లేదా విశ్వస్వయంచలన యంత్ర తాలూకు సృజనాత్మక మర్మర ధ్వని.