పుట:Oka-Yogi-Atmakatha.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం

63

“అనంతదా,[1] నువ్వు గూఢచారివై పుట్టావు!” అంటూ తమాషాగా నేను చూసిన చూపులో కొంత విసుగుదల కూడా లేకపోలేదు. “జతీన్‌దా ప్రవర్తనకు కారణం, ఆత్మరక్షణ చేసుకోవాలన్న సహజ స్వభావమేకాని మమ్మల్ని మోసం చెయ్యాలని కాదని తెలిసి నాకు సంతోషమయింది,” అని అతనితో చెబుతాను.

కలకత్తాలో ఇంటిదగ్గర నాన్న గారు, కనీసం నా హైస్కూలు చదువు పూర్తయే దాకా నయినా తిరిగే కాళ్ళని నిలకడగా ఉంచుకోమని నా మనస్సులో నాటుకొనేటట్లుగా చెబుతూ బతిమాలారు. నేను లేని సమయంలో, వాత్సల్యంతో ఒక తంత్రం పన్ని- ఋషితుల్యులైన స్వామీ కేవలానందగారు[2] - అనే పండితు లొకరు రోజూ మా ఇంటికి వచ్చే ఏర్పాటు చేశారు.

“వీరు నీకు సంస్కృతం నేర్పుతారు,” అని నాకు చెప్పారు నాన్నగారు.

బాగా చదువుకొన్న దార్శనికుని దగ్గర నాకు శిక్షణ ఇప్పించి నట్లయితే, ఆధ్యాత్మికమయిన నా ఆకాంక్షలను తృప్తిపరచ వచ్చునని

  1. అతన్ని నే నెప్పుడూ అనంత-దా అనే పిలిచేవాణ్ణి. తమ్ముళ్ళుగాని చెల్లెళ్ళుగాని అన్నగారిని సంబోధించేటప్పుడు, అతని పేరుకు చివర ‘దా’ అన్న గౌరవ వాచకం చేరుస్తారు.
  2. మేము కలుసుకొనే నాటికి కేవలానందగారు సన్యాసం తీసుకోలేదు. ఆయన్ని మామూలుగా “శాస్త్రి మహాశయ” అని పిలుస్తూండేవారు. కాని లాహిరీ మహాశయ, మాస్టర్ మహాశయ (అధ్యాయం : 9) అనే పేర్లు వచ్చినప్పుడు గందరగోళం లేకుండా ఉండాలని మా సంస్కృతం మాస్టరుగారి ప్రస్తావన వచ్చినప్పుడు, ఆయనకి సన్యసించిన తరవాత వచ్చిన ‘స్వామీ కేవలానంద’ అన్న పేరే వాడుతున్నాను. ఇటీవల బెంగాలీలో ఆయన జీవిత చరిత్ర వెలువడింది. ఆయన గృహస్థనామం అశుతోష్ చటర్జీ.