పుట:Oka-Yogi-Atmakatha.pdf/838

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

802

ఒక యోగి ఆత్మకథ

“పన్నెండేళ్ళ నాలుగునెల్ల వయస్సునుంచి ఇప్పటి అరవై ఎనిమిదేళ్ళవరకు యాభైఏళ్ళ పై చిలుకుగా నాకు అన్నపానాలు లేవు.”

“తినాలని మీ కెప్పుడు అనిపించలేదా?”

“అన్నంకోసం ఆర్తి కలిగితే తినవలసి ఉండేది.” రోజుకు ముప్పొద్దులా తిండి తింటేకాని బతకలేని ప్రపంచానికి తెలియని స్వతస్సిద్ధమైన సత్యాన్ని ఈవిడ, హుందాగానే, ఎంత సులువుగా చెప్పారు!

“కాని మీరు ఏదో ఒకటి ఆహారంగా తీసుకుంటూనే ఉంటారేమో!” నా కంఠస్వరంలో కొద్దిగా ఆక్షేపణ ధ్వనించింది.

“తప్పకుండా!” చటుక్కున అర్థం చేసుకుంటూ చిరునప్పు నవ్వారు ఆవిడ.

“గాలిలోంచి సూర్యకాంతి[1]లోంచి వచ్చే సూక్ష్మతర శక్తులవల్లా,

  1. “మనం తినేది వితరణ జీవశక్తి; మన తిండి చాలా పరిమాణాల శక్తి,” అంటు 1933 మే 17 న మెంఫిస్‌లో జరిగిన వైద్యశాస్త్రవేత్తల సమావేశంలో, క్లీవ్ లాండ్ వాస్తవ్యుడైన డా॥ జార్జి డబ్ల్యు క్రైల్ చెప్పాడు. శరీరంలోని విద్యుద్వలయమైన నాడీమండలానికి విద్యుత్ ప్రవాహాల్ని పంపే అత్యంత ముఖ్యమైన ఈ వికిరణ జీవశక్తి, సూర్యకిరణాలవల్ల ఆహారంలో సమకూరుతుంది. అణువులు సౌరమండలాలు అంటాడు డా॥ క్రైల్. అణువులు, చుట్టుకుపోయిన అనేక స్ప్రింగుల మాదిరిగా, సూర్యకిరణాలు నిండిఉన్న వాహకాలు. అసంఖ్యాకమైన అణుప్రమాణాల శక్తిని ఆహారంలో తీసుకుంటాం. అణువులు ఒకసారి మానవశరీరంలోని ప్రోటోప్లాజం (జీవపదార్థం) లోకి ప్రవేశించిన తరవాత, వాటి సూర్యకాంతి కొత్త రసాయనిక శక్తినీ కొత్త విద్యుత్ప్రవాహాల్ని సమకూరుస్తుంది. ‘మీ శరీరం అలాంటి అణువులతో ఏర్పడ్డది’, అంటాడు డా॥ క్రైల్. ‘అవే మీ కండరాలూ మెదళ్ళూ కళ్ళూ చెవులూలాంటి జ్ఞానేంద్రియాలూను.’ ”

    మానవుడు నేరుగా సౌరశక్తివల్ల ఎలా జీవిస్తాడో, శాస్త్రవేత్తలు ఎప్పుడో ఒకనాడు కనిపెడతారు. “సృష్టిలో, సూర్యకాంతి గ్రాహకశక్తి ఏదో ఒక విధంగా ఉన్నట్టుగా మనకు తెలిసిన ఒకే ఒక పదార్థం, క్లోరోఫిల్ (పత్రహరితం),” అంటూ న్యూయార్క్ టైమ్స్‌లో రాశాడు, విలియం ఎల్. లారెన్స్. “సూర్యకాంతిలో ఉన్న శక్తిని ఇది గ్రహించి, మొక్కలో నిలవచేస్తుంది. ఇది లేకపోతే ప్రాణం నిలవదు. బతకడానికి మనకు కావలసిన శక్తిని మనం, శాకాహారంలోనిలవఅయి ఉన్న సౌరశక్తి నుంచి పొందుతాం; మనం ఆ శాకాహారమైనా, తింటాం, శాకాహారం తినే జంతువుల మాంసమైనా తింటాం, బొగ్గునుంచికాని, నూనెనుంచికాని మనకు వచ్చే శక్తి, అనేక లక్షల సంవత్సరాల కిందటి వృక్షాల క్లోరోఫిల్‌ను నిక్షిప్తంచేసుకున్న సౌరశక్తి, మనం క్లోరోఫిల్ ద్వారా సూర్యుడివల్ల బతుకుతున్నాం.