పుట:Oka-Yogi-Atmakatha.pdf/834

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

798

ఒక యోగి ఆత్మకథ

గానూ వస్తూంటే, పిల్లలు పెద్ద ఊరేగింపుగా వచ్చి చేరుతున్నారు. ఈ రోడ్లమీద సాగిన మొట్టమొదటి కారు, బహుశా మాదే కావచ్చు; ఇక్కడ, ‘ఎద్దుబండ్ల సంఘం’ సర్వశక్తి మంతంగా ఉండి ఉండాలి! ఎంత సంచలనం కలిగించాం మేము! పురాతనమైన ఏకాంతాన్నీ పవిత్రతనూ చెడగొడుతూ సూటిగా తమ గూడెంలోకి చొచ్చుకువచ్చే కారును అమెరికా వా డొకడు నడుపుతూ ఉండగా సాగివస్తున్న మా బృందం!

“ఒక సన్న సందు దగ్గర ఆగి, వంద అడుగుల దూరంలో ఉన్న గిరిబాలగారి పూర్వికుల ఇంటిని చూశాం. గతుకుల రోడ్డుమీద నానా పాట్లూ పడుతూ చేసిన మా దూరప్రయాణం ముగిసిన తరవాత, ఒక విధమైన కార్యసాఫల్యానందం అనుభవించాం మేము. ఇటికలతోనూ సున్నంతోనూ కట్టిన ఒక పెద్ద రెండంతస్తుల భవనం దగ్గరికి వెళ్ళాం; ఆ భవనం చుట్టూ ఉన్న గుడిసెల ముందు అది కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. ఆ ఇల్లు ఇప్పుడు మరమ్మతుల్లో ఉంది; దాని చుట్టూ వెదుళ్ళతో కట్టిన పరంజా ఉంది.”

“ఆత్రంగా ఎదురు చూడ్డంతోనూ అణచుకున్న అనందంతోనూ మేము భగవంతుడి క్షుధారహిత స్పర్శతో పునీతురాలైన వ్యక్తి ఇంటి ముందు నిలిచాం. తలుపులు తెరిచి ఉన్నాయి. పిన్నలూ పెద్దలూ, బట్టలు కట్టుకోనివాళ్ళూ కట్టుకున్న వాళ్ళూ అదే పనిగా మాకేసి కళ్ళప్పగించి చూస్తున్నారు; కొద్దిపాటి కుతూహలమున్న ఆడవాళ్ళూ మగవాళ్ళూ మగపిల్లలూ ఈ అపూర్వ దృశ్యాన్ని తిలకిస్తూ మా వెంట ఉన్నారు.”

“కొద్దిసేపట్లోనే ఒక పొట్టి మనిషి గుమ్మంలో కనిపించింది - ఆవిడే గిరిబాల! లేత బంగారువన్నె, పట్టుపంచె కట్టుకొని ఉన్నారావిడ. భారతీయులకు సహజమైన విధంగా సవినయంగానూ జంకుతూనూ ముందుకు వచ్చారు; స్వదేశీ వస్త్రం పై మడతలోంచి కొద్దిగా తొంగి