పుట:Oka-Yogi-Atmakatha.pdf/833

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిరాహార యోగిని

797

“ఊరి బయట ప్రత్యేకంగా ఒక స్థలంలో ఉన్న దేవాలయంలో అర్చన ముగించుకొని ఇంటిముఖం పట్టిన భక్తబృందంలో ఒకర్ని మాకు దారి చూపించమని అడుగుతూ ఉండగా ఒంటిమీద అంతంత మాత్రంగానే బట్టలున్న కుర్రవాళ్ళు ఒక డజనుమంది మమ్మల్ని గిరిబాలగారి ఇంటికి తీసుకువెళ్దామన్న ఉత్సాహంతో కారుకు రెండు పక్కలా మూగేశారు.”

“కొన్ని మట్టిగుడిసెలకు నీడనిస్తున్న ఈతచెట్లతోపు వేపు సాగింది మా దారి; కాని మేము అక్కడికి చేరేలోగా మా ఫోర్డు కారు ఒక్క క్షణం ఒరిగి, పైకి ఎగిరిపడింది. ఆ సన్నటి దారి చెట్లచుట్టూ, చెరువుల చుట్టూ గుట్టల మీదుగా, గుంటల్లోకి లోతైన గాళ్ళలోకి సాగింది. గుబురు పొదలమీద కారు లంగరు వేసినట్టయి, తరవాత ఒక గుట్టమీదికి దేకింది. మేము మెల్లగా, జాగ్రత్తగా ముందుకు సాగాం. ఇంతలో హఠాత్తుగా దారి అటకాయించిపోయింది; బండిదారి మధ్యలో మొక్కల గుబురు ఒకటి ఉంది. అంచేత చుట్టు తిరగడం అవసరమయింది. ఒక ఏటవాలు రాతిచట్టు మీంచి కిందకి, ఎండిపోయిన ఒక చెరువులోకి దిగింది కారు. అక్కణ్ణించి కారు బయటపడ్డానికి, కొంత గీకడం, నరకడం, పారతో చెలగడం అవసరమయాయి. దారి ఎక్కడికక్కడ, ముందుకు పోవడానికి వీలులేకుండా ఉంది; అయినా మా యాత్ర సాగవలసిందే. వందకొద్ది పిల్లలూ తల్లిదండ్రులూ తేరిపారి చూస్తూండగా, ఉపకార బుద్ధిగల కుర్రవాళ్ళు పారలు తెచ్చి అడ్డంకులు తొలగించేశారు. (గణేశుడి ఆశీస్సుల మహిమ!)

“కాస్సేపట్లో మేము, రెండు పాతగాళ్ళ గుండా మెల్లగా దారి చేసుకుంటూ పోతుంటే, ఆడవాళ్ళు, గుడిసెల గుమ్మాల దగ్గర నించుని కళ్ళు విప్పార్చుకొని చూస్తున్నారు. మగవాళ్ళు మా పక్కగానూ వెనక