పుట:Oka-Yogi-Atmakatha.pdf/819

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బెంగాలీ "ఆనందమయి మాత"

783

ఉండదు. ఎవరూ పెట్టకపోతే అన్నం తినరు; అడగనూ అడగరు, ఆవిడ ముందు అన్నం పెట్టినా కూడా ముట్టుకోరు. ఆవిడ ఈ లోకంలోంచి అదృశ్యం కాకుండా చూడ్డం కోసం, శిష్యురాళ్ళం మేమే మా చేతులతో తినిపిస్తాం. తరచుగా ఆవిడ, వరసగా కొన్ని రోజులపాటు దివ్య సమాధిలో ఉండిపోతారు; ఊపిరి ఆడడమే అరుదు; కళ్ళు రెప్పవాలకుండా ఉండిపోతాయి. ఆవిడ ముఖ్య శిష్యుల్లో ఒకరు, ఆమె భర్త. చాలా ఏళ్ళ కిందట, వాళ్ళ పెళ్ళి కాగానే, ఆయన మౌనవ్రతం పట్టారు.”

పొడుగాటి జుట్టూ జీబురు గడ్డమూ విశాలమైన భుజాలూ చక్కని అంగసౌష్ఠవమూ గల ఒకాయన్ని చూపించిందా శిష్యురాలు. గుంపు మధ్యలో ప్రశాంతంగా నించుని ఉన్నారాయన; భక్తితత్పరత చూపే శిష్యుడి మాదిరిగా చేతులు జోడించుకొని ఉన్నారాయన.

అనంత ఆనందసాగరంలో ఒక్కసారి మునిగి పునర్నవం చెందిన ఆనందమయి మాత, ఇప్పుడు తన చేతనను భౌతిక ప్రపంచం మీద కేంద్రీకృతం చేస్తోంది.

“బాబా, నువ్వెక్కడ బస చేశావో చెప్పు.” ఆవిడ కంఠస్వరం స్పష్టంగా, శ్రావ్యంగా ఉంది.

“ప్రస్తుతం కలకత్తాలోనో, రాంచీలోనో; కాని త్వరలో తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నాను.”

“అమెరికాకా?”

“ఔనమ్మా. ఆధ్యాత్మిక అన్వేషణ సాగించేవాళ్ళు భారతీయ సాధ్వీమణిని చిత్తశుద్ధితో మెచ్చుకుంటారు. నువ్వు కూడా వస్తావా?”

“బాబా తీసుకువెడితే వస్తా.”