పుట:Oka-Yogi-Atmakatha.pdf/818

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

782

ఒక యోగి ఆత్మకథ

కారు వెనకసీట్లో కూర్చున్నాం ఇద్దరం. కాసేపట్లోనే ఆనందమయి మాత నిశ్చల సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆమె సుందరనయనాలు అర్ధనిమీలితాలయి ఊర్ధ్వలోకాభిముఖంగా నిలకడగా నిలిచిపోయాయి. సమీప దూరాల్లోగల ఆంతరిక స్వర్గరాజ్యంలోకి చూస్తున్నాయవి. “జయ జయ జగజ్జననీ!” అంటూ మెల్లిగా జోహార్లు పలికారు శిష్యులు.

నేను భారతదేశంలో దైవసాక్షాత్కారం పొందిన పురుషుల్ని చాలా మందిని చూశాను; కాని అటువంటి ఉన్నతస్థితి నందుకున్న సాధ్విని అంతకుముందు ఎన్నడూ చూడలేదు.

ఆమె కోమల ముఖమండలం అనిర్వచనీయమైన ఆనందంతో మరింత మెరుస్తోంది; ఆమెకు ఆనందమయి మాత అన్న పేరు రావడానికి కారణం అదే. ముసుగు వేసుకోని తలకు వెనకాల విరబోసిన పొడుగాటి నల్లటి జుట్టు వేలాడుతోంది. ఎప్పుడూ తెరుచుకొనే ఉండే ఆమె జ్ఞాన నేత్రానికి గుర్తుగా నుదుట ఎర్రటి గంధంబొట్టు ఉంది. చిన్న ముఖం, చిన్న చేతులు, చిన్న కాళ్ళు- ఆమె ఆధ్యాత్మిక పరిమాణానికి విరోధా భాసంగా ఉన్నాయి!

ఆనందమయి మాత సమాధి స్థితిలో ఉండగా, పక్కనున్న శిష్యురాలిని కొన్ని ప్రశ్నలు వేశాను.

“ఆనందమయి మాత భారతదేశంలో విరివిగా ప్రయాణాలు చేస్తారు; ఆవిడకి అనేక ప్రాంతాల్లో వందలకొద్దీ శిష్యులున్నారు,” అని చెప్పింది శిష్యురాలు. “ఆవిడ సాహసించి చేసిన ప్రయత్నాలవల్ల వాంఛనీయమైన సంఘ సంస్కరణలు చాలా వచ్చాయి. ఆవిడ బ్రాహ్మణి అయినప్పటికీ కులభేదా లేవీ పాటించరు. ఆవిడకు జరగవలసిన సదుపాయాలు చూస్తూ మేము కొంతమందిమి, ఆవిడతోబాటు ప్రయాణాలు చేస్తూ ఉంటాం. మేము ఆవిణ్ణి తల్లిలా సాకాలి; ఆవిడకి ఒంటిమీద ధ్యాస