పుట:Oka-Yogi-Atmakatha.pdf/805

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీమహాత్ములతో వార్ధాలో

769

నియమాన్ని మన జీవితధర్మంగా చేసుకోవాలని నిర్ధారణ చేసుకుంటే, ప్రతి సమస్యా పరిష్కారానికి లొంగుతుంది.”

ఆధ్యాత్మిక దృష్టి లేకపోతే ప్రజలు నశించిపోతారన్న సత్యాన్ని, భయంకరమైన ప్రపంచ రాజకీయ సంఘటనల పరంపర, నిర్దాక్షిణ్యంగా చూపిస్తోంది. మతం కాకపోతే విజ్ఞానశాస్త్రం, మానవజాతిలో భద్రతా రాహిత్యజ్ఞాన లేశాన్నీ సమస్త భౌతిక వస్తువుల అశాశ్వతత్వాన్నీ జాగృతం చేసింది. మానవుడిప్పుడు, అంతర్నిహితమైన తన మూలతత్త్వం దగ్గరికి అంటే తనలో ఉన్న పరమాత్మ దగ్గరికి ― కాకపోతే, నిజంగా మరెక్కడికి పోతాడు?

చరిత్ర తిరగేసినట్లయితే, మానవుడి సమస్యలేవీ పాశవిక శక్తిని ఉపయోగించడంవల్ల పరిష్కారం కాలేదని సహేతుకంగా ఎవరయినా చెప్పవచ్చు. మొదటి ప్రపంచయుద్ధం, దురంత భయానక కర్మను సృష్టించింది; అది రెండో ప్రపంచ యుద్ధంగా పరిణమించింది. ఇప్పటి దుష్కర్మ అనే పెద్ద మంచుగడ్డను కరిగించగలిగింది, సోదరభావమనే ఎండవేడి మాత్రమే; లేనినాడు, అది మూడో ప్రపంచయుద్ధంగా మారవచ్చు. ఇరవయ్యో శతాబ్దిలో అమంగళత్రయం! వివాదాల్ని పరిష్కారం చెయ్యడంలో మానవ వివేకానికి బదులుగా ఆటవిక తర్కాన్ని ఉపయోగించినట్లయితే భూమిమీద మళ్ళీ ఆటవికతను సృష్టించినట్టే. జీవితంలో సోదరులు కాకపోతే, భయానక మృత్యువులోనే సోదరులవుతారు వాళ్ళు. అణుశక్తుల్ని కని పెట్టడానికి దైవం, ప్రేమతో మనిషిని అనుమతించింది అటువంటి అవమానం తెచ్చుకోడానికి కాదు.

యుద్ధమూ నేరమూ ఎన్నడూ లాభించవు. విస్ఫోటక శూన్యత అనే పొగలోకి పోయిన కోట్లకొద్ది డాలర్లు, ఒక కొత్త ప్రపంచాన్ని- రోగమన్నది దాదాపు లేకుండా, పేదరికం అసలే లేకుండా ఉండే ప్రపంచాన్ని