పుట:Oka-Yogi-Atmakatha.pdf/804

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

768

ఒక యోగి ఆత్మకథ

బలానికి బదులుగా, ఆచరణానుకూలమైన అహింసను ప్రత్యామ్నాయంగా ప్రసాదించారు. కష్టనష్టాల్ని తీర్చడానికి అన్యాయాల్ని తొలగించడానికి గాంధీమహాత్ములు అహింసా సాధానాల్ని చేబట్టారు. అవి ఎంత ఫలదాయక మైనవో పదేపదే నిరూపించుకున్నాయి. ఆయన తమ సిద్ధాంతాన్ని కింది మాటల్లో చెప్పారు:

“వినాశానికి నడుమ జీవితం కొనసాగుతూండడం చూశాను. కాబట్టి వినాశంకంటె పరమధర్మం ఒకటి ఉండితీరాలి. ఒక్క ఆ ధర్మంలో సువ్యవస్థితమైన సమాజమే అవగాహనకు అందుతుంది; జీవితం జీవన యోగ్యమవుతుంది.”

“జీవితధర్మం అదే అయినట్లయితే, మనం దాన్ని నిత్యజీవితంలో అమలులో పెట్టాలి. యుద్ధాలు ఎక్కడ ఉంటే అక్కడ, ప్రత్యర్థి ఎక్కడ ఎదురయితే అక్కడ, మనం ప్రేమతో జయించాలి. ఒకానొక ప్రేమసూత్రం నా జీవితంలోనే, విధ్వంస సూత్రం అందించనంత ఫలితాన్ని అందించింది.”

“భారతదేశంలో మనకు, ఈ సూత్రం పనిచెయ్యడం అత్యంత విశాల స్థాయిలో కళ్ళకు కట్టింది. అహింస 36,00,00,000 మందిలోకి చొచ్చుకుపోయిందని నేను అనను; కాని అత్యంత స్వల్పకాలంలో ఏ ఇతర సిద్ధాంతమూ చొచ్చుకుపోనంతగా ఇది చొరబారిందని తప్పకుండా చెబుతాను.”

“అహింసాత్మక మనఃస్థితి సాధించడానికి చాలా శ్రమతో కూడా శిక్షణ అవసరమవుతుంది. సైనికుడి జీవితంలాగే అది, క్రమశిక్షణతో కూడిన జీవితం. మనోవాక్కాయాలు సరయిన సమన్వయం పొంది ఉన్నప్పుడే పరిపూర్ణస్థితిని అందుకోడం జరుగుతుంది. సత్యాహింసల