పుట:Oka-Yogi-Atmakatha.pdf/802

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

766

ఒక యోగి ఆత్మకథ

పూజించడానికి అవకాశం దాంట్లో ఉంది.[1] సామాన్యార్థంలో అది, ప్రచారక మతం కాదు. అది చాలా తెగల్ని తనలో లీనం చేసుకుందనడంలో సందేహం లేదు; కాని ఈ లీనం చేసుకోడమన్నది పరిణామాత్మకంగానూ అగోచరంగానూ జరిగింది. ప్రతి ఒక్కడూ తన విశ్వాసాన్నిబట్టి, లేదా ధర్మాన్ని [2]బట్టి దేవుణ్ణి కొలవాలని చెబుతూ, తద్వారా అన్ని మతాలతోనూ శాంతియుత సహజీవనం చేస్తుంది.”

క్రీస్తు గురించి గాంధీగారు ఇలా రాశారు: “ఆయన కనక ఇప్పుడు మనుషుల మధ్య నివసిస్తూ ఉండి ఉంటే, ఆయన, ‘నన్ను ప్రభూ, ప్రభూ... అంటూ పిలిచే ప్రతి వాళ్ళూ కాక, నా తండ్రి ఇచ్ఛానుసారంగా నడుచుకొనేవాడు మాత్రమే,’[3] అని రాసినట్టుగానే, బహుశా తన పేరు కూడా ఎన్నడూ విని ఉండని అనేకమంది జీవితాల్ని దీవించి ఉండేవాడని నా దృఢవిశ్వాసం. ఏసుక్రీస్తు, తన జీవితం ద్వారా నేర్పిన పాఠంలో

  1. ప్రపంచమతాల్లో హిందూమతం విశిష్టత ఏమిటంటే, అది ఎవరో ఒక గొప్ప వ్యవస్థాపకుడు ఏర్పరిచింది కాక, వ్యక్తి ప్రమేయంలేని వైదిక గ్రంథాల ద్వారా ఆవిర్భవించింది. ఆ విధంగా హిందూమతం, అన్ని కాలాల, అన్నిదేశాల ప్రవక్తల్నీ పూజ్యభావంతో కలుపుకోడానికి అవకాశమిస్తుంది. పవిత్ర వేదగ్రంథాలు, మానవుడు చేసే ప్రతి పనికీ దైవనియమంతో సామరస్యం కలిగించే ప్రయత్నంలో భక్తి తత్పరతనే కాకుండా ముఖ్యమైన సాంఘికాచారాల్ని అన్నిటినీ కూడా క్రమబద్ధం చేస్తాయి.
  2. నియమ [న్యాయ] పదం కన్న సమగ్రమైన సంస్కృత పదం; నియమానికి, లేదా స్వాభావిక ఋజువర్తనకు కట్టుబడి ఉండడం; ఏ ఒక సమయంలో నయినా మనిషి ఉండే పరిస్థితుల్లో, అతనికి సహజమైన కర్తవ్యం. మానవుడు పతనంనుంచి, బాధనుంచి తనను కాపాడుకోడానికి తోడ్పడే స్వాభామిక నియమ సముదాయమని, పవిత్ర గ్రంథాలు ధర్మాన్ని నిర్వచించాయి.
  3. మత్తయి 7: 21.