పుట:Oka-Yogi-Atmakatha.pdf/801

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీమహాత్ములతో వార్ధాలో

765

“బైబిలు, కొరాను, జెంద్ - అవెస్తా[1] అన్నవి వేదాల లాగే దైవ ప్రేరణవల్ల రచించినవేనని నమ్ముతాను. గురు సంప్రదాయాన్ని విశ్వసిస్తాను. కాని ఈ కాలంలో అనేక లక్షలమంది, గురువు లేకుండానే పోవలిసి వస్తోంది. దానికి కారణం, పరిపూర్ణ పరిశుద్ధతా, పరిపూర్ణ విద్వత్తూ- రెండూ ఉన్నవారు చాలా అరుదై పోవడం. కాని ఎవరూ, తమ మతానికి సంబంధించిన సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నామని నిరాశ పడక్కర్లేదు. ఎంచేతంటే, తక్కిన గొప్ప మతాలన్నిటిలోని మౌలికాంశాలలాగే, హిందూమత మౌలికాంశాలు కూడా మార్పు చెయ్యరానివీ సులువుగా తెలుసుకోగలిగినవీ.”

“ప్రతి హిందువులాగే నేనూ దేవుణ్ణి నమ్ముతాను; ఆయన ఒక్కడేననీ నమ్ముతాను; పునర్జన్మ, మోక్షం ఉన్నాయని నమ్ముతాను...... హిందూమతం మీద నాకున్న అభిప్రాయాల్ని గురించి, నా భార్యమీద నా కున్న అభిప్రాయాల్ని గురించి చెప్పగలిగిన దానికంటె ఎక్కువ చెప్పలేను. ప్రపంచంలో ఏ ఆడదీ స్పందింపజెయ్యలేనంతగా, ఆవిడ నన్ను స్పందింపజేస్తుంది. అలాగని, ఆవిడ తప్పు లేమీ చెయ్యదని కాదు; నేను గమనించగలిగిన వాటికంటె ఎక్కువ లోపాలే ఆవిడలో ఉన్నాయని నేను తెగించి చెబుతాను. కాని తెగరాని బంధం ఒకటి ఉంది. అలాగే హిందూమతంలో లోపాలూ పరిమితులూ ఎన్ని ఉన్నప్పటికీ, అదంటే నేను స్పందిస్తాను. గీతలో కాని, తులసీదాసు రాసిన రామాయణంలో కాని ఉన్న సంగీతాన్ని మించి మరేవీ నన్ను ఆనందపరచలేదు. నేను కొన ఊపిరి తీసుకుంటున్నాననుకుంటే, గీతే నాకు ఊరట ఇస్తుంది.”

“హిందూమతం ఒంటెత్తు మతం కాదు. ప్రపంచ ప్రవక్తలందరినీ

  1. క్రీ. పూ. సుమారు 1000 లో జొరాస్టర్ పర్షియాకు ప్రసాదించిన పవిత్ర గ్రంథం.