పుట:Oka-Yogi-Atmakatha.pdf/795

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీమహాత్ములతో వార్ధాలో

759

నందుకు మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. భారతదేశం కోసం మీరు చేపట్టిన జీవిత కృషిలో నన్ను మీకు సమానురాలిగా పరిగణించినందుకు మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. జూదంలోనూ పందాల్లోనూ స్త్రీలోలత విషయంలోనూ మద్యపానంలోనూ పాటల్లోనూ తమ కాలాన్నంతనీ వెచ్చించేసి, చిన్న నాటి ఆటవస్తువులంటే తొందరగా విసుగెత్తిపోయే చిన్న పిల్లవాడి మాదిరిగా భార్య అన్నా, పిల్లలన్నా విసుగెత్తేసే భర్తల్లో మీరు ఒకరు కానందుకు మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఇతరుల శ్రమను దోచుకుంటూ, ధాన్యం పండించడానికే తమ కాలాన్ని వినియోగించే భర్తల్లాంటివారు మీరు కానందుకు ఎంతగా ధన్యవాదాలు చెప్పుకోవాలి!”

“లంచాలకన్న దేవుడికీ దేశానికీ మీరు అగ్రస్థానం ఇస్తున్నందుకూ మీకు దృఢవిశ్వాసబలం ఉన్నందుకూ భగవంతుడిమీద సంపూర్ణమైన ప్రగాఢ విశ్వాసం ఉన్నందుకు మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పుకోవాలో! నా కన్న దేవుడికి దేశానికి అధిక ప్రాముఖ్యమిచ్చే భర్తకు భార్యనయినందుకు నేను ఎంతగా ధన్యవాదాలు చెప్పుకోవాలి? మన జీవిత విధానాన్ని మీరు, అంత సంపన్న స్థితినుంచి అంత స్వల్పస్థితికి మారుస్తూంటే నేను సణుక్కొంటూ తిరగబడినప్పుడు, నా కుర్రతనపు లోపాలకు మీరు ఓర్పు చూపినందుకు మీకు కృతజ్ఞురాలిని.”

“చిన్న పిల్లగా ఉన్నప్పుడు నేను మీ తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నాను; మీ అమ్మగారు గొప్ప ఉత్తమురాలు; ఆవిడ నాకు చక్కని తర్ఫీదు ఇచ్చారు; ధైర్యసాహసాలుగల భార్య ఎలా ఉండాలో, నాకు భర్త కాబోయే తమ కుమారుడి ప్రేమనూ గౌరవాన్ని ఎలా నిలుపుకోవాలో నేర్పారావిడ. ఏళ్ళు గడుస్తూ ఉండగా, మీరు భారతదేశానికి అత్యంత ప్రియతమ నాయకులయారు. ఇతరదేశాల్లో తరచు జరుగుతుండే మాదిరిగా, భర్త విజయ సోపానాలు ఎక్కినప్పుడు భార్యను విడిచి పెట్టేసే