పుట:Oka-Yogi-Atmakatha.pdf/794

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

758

ఒక యోగి ఆత్మకథ

మహాత్ముల ధర్మపత్ని కస్తూరిబాయి. ఈమె విశిష్టురాలు. తనకోసం, పిల్లలకోసం ఆయన తమ ఆస్తిలో భాగమేదీ కేటాయించి పెట్టనందుకు ఆమె ఆక్షేపించలేదు. చిన్నతనంలోనే పెళ్ళి అయిన గాంధీగారూ భార్యా నలుగురు కొడుకులు పుట్టిన తరవాత బ్రహ్మచర్య వ్రతం ప్రారంభించారు.[1] వారి దాంపత్య జీవనం ఒక గంభీరమైన రూపకం; అందులో ప్రశాంతనాయిక అయిన కస్తూరిబాయి, భర్త అడుగుజాడల్లో నడిచి జైలుకు వెళ్ళారు; మూడు వారాలపాటు ఆయన ఉపవాసాలు చేసినప్పుడు ఆమె కూడా చేశారు. ఆయన వహించే లెక్కలేనన్ని బాధ్యతల్లో ఆమె తమవంతు పూర్తిగా వహించారు. గాంధీగారికి ఆవిడ ఈ విధంగా జోహార్లు అర్పించారు.

“మీ యావజ్జీవిత సహచారిణిగా, సహాయకురాలిగా ఉండే మహదవకాశం పొందినందుకు మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మన దాంపత్యం, కామవాంఛ మీద కాకుండా, ‘బ్రహ్మచర్యం’ (ఆత్మనిగ్రహం) మీద ఆధారపడి ప్రపంచమంతటిలోకీ సర్వశ్రేష్ఠమైన దాంపత్యమయి

  1. గాంధీగారు, ‘ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్’ అన్న పుస్తకం (అహమ్మదాబాద్ : నవజీవన్ ప్రెస్) లో తమ జీవిత కథను కఠోరమైన నిష్కాపట్యంతో అభివర్ణించారు.

    ప్రసిద్ధమైన పేర్ల తోనూ అద్భుతమైన సంఘటనలతోనూ కిక్కిరిసిపోయే ఆత్మకథలు అనేకం, అంతరంగ విశ్లేషణ విషయంలో కాని, వికాసానికి సంబంధించిన ఏదశను గురించి కాని, దాదాపు పూర్తిగా మౌనం వహిస్తాయి. “ఈయన చాలామంది ప్రసిద్ధ వ్యక్తుల్ని ఎరిగినవాడే కాని, తనను తాను ఎన్నడూ తెలుసుకున్నవాడు కాడు,” అన్నట్టుగా, ఒక రకమైన అసంతృప్తితో ఈ పుస్తకాలు పక్కన పెట్టేస్తాడు చదువరి. గాంధీగారి ఆత్మకథ విషయంలో ఇలాటిది జరగడం అసంభవం; ఆయన తమ తప్పుల్నీ తమాషాల్నీ వ్యక్తి ప్రమేయంలేని సత్య సంధతతో బయటపెడతారు; ఏ యుగ చరిత్రలోనయినా ఇలాటిది జరగడం అరుదు.